దేవుడా! ఇదేం ఖర్మ! తిరుపతిలో నరకయాతన
భక్తులకు నరకం చూపిస్తున్న ఏడుకొండలవాడు
Tirupati: తిరుపతిలో ఊహించనవిధంగా భక్తులు నరకయాతన అనుభవిస్తున్నారు. భయానికో, భక్తికో దేవున్ని దర్శించుకుంటారు. కానీ ఇప్పుడు భక్తితో అక్కడకు వెళ్లినా…భయంభయంగానే ఉండాల్సి వస్తున్నది. భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించడంలోనూ, సమన్వయం సాధించడంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఘోరంగా విఫలమైంది. ఉచిత దర్శనాలకు సైతం ఆన్ ైన్లో టైం స్లాట్ విధానం పెట్టడంతో వారి టైం వచ్చేదాకా తిరుపతిలోనే వెయిట్ చేయక తప్పని పరిస్థితులు తలెత్తాయి. అప్పటిదాకా అక్కడే ఉండాలంటే వేలకు వేల రూపాయలు ఖర్చవుతోంది. ఇక్కడే భక్తులు యాచకులుగా మారే దుస్థితిని టీడీడీ కల్పిస్తోంది. దేవుడి ముందు అందరూ సమానమేనని సన్యాసులు, పండితులు చెప్పే సొల్లుకబర్లు అన్నీ ఒట్టివేనని తేలిపోయింది. టీటీడీ లేనిపోని ఆంక్షలు, పరిమితులు విధించడంతో భక్తులకు మానసిక క్షోభ తప్ప ఇంకేమీ మిగలడం లేదు. టైం స్లాట్ విధానం పేరుతో తిరుమల శ్రీవారి దర్శనార్ధం వచ్చిన భక్తులను కొండకిందే నిలువరించాలనే ప్రయత్నం బెడిసి కొడుతోంది. కోవిడ్ నుంచి క్షేమంగా బయట పడినందుకు తిరుమల వెంకన్నకు మొక్కు చెల్లించుకోవాలనుకున్న భక్తులకు నిత్యం చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. కొన్నిసార్లు తిరుపతి యాత్రకు వచ్చిన వారు దారినిపోయేవారిని బిక్షగాళ్లలో డబ్బులు అడుక్కునే దుస్థితిలోకి టీటీడీ నెట్టేస్తోంది. కోవిడ్ నుంచి సాధారణ పరిస్థితులు వచ్చాక కూడా చాలా రోజులు 300 రూపాయలు చెల్లించిన వారికే దర్శనం కల్పించే విధానం అమలు చేసింది. టీడీడీపై విమర్శలు వెల్లువెత్తడంతో ఉచిత దర్శనాలను కూడా అనుమతించింది. అవి కూడా ఆన్ లైన్లో టైం స్లాట్ విధానం ద్వారా టిక్కెట్టు పొందిన వారికే దర్శనమని మెలిక పెట్టింది. ఇది అన్ని సమయాలలో అందరికీ సాధ్యం కాదని ఆచరణాత్మకంగా తెలుసుకున్న తర్వాత తాత్కాలిక ప్రాతిపదికన తిరుపతిలో ఉచిత టిక్కెట్టును టైం స్లాట్ విధానంలో ఇచ్చే పద్దతిని మొదలుపెట్టింది.
టైం స్లాట్ ప్రకారం ఒక్కో భక్తుడికి నిర్ధిష్టమైన దర్శన సమయాన్ని ముందుగానే టీడీడీ కేటాయిస్తుంది. ఆ సమయానికి భక్తులు కొండకు వెళ్ళి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. అప్పటి వరకు తిరుమల కొండకు అనుమతి ఉండదు. ఇది ఆన్ లైన్ విధానంలో టిక్కెట్టు పొందిన వారి విషయంలో కొంత వర్కవుటై ఉచిత దర్శనం కోసం వచ్చే వారి విషయంలో మాత్రం వైఫల్యమౌతోంది. ఉచిత దర్శన టోకెన్లను కేటాయించడానికి తిరుపతిలో కౌంటర్లు ఏర్పాటు చేసిన టీటీడీ అంతటితో చేతులు దులిపేసుకుంది. రోజుకు ఆరు వేల మంది యాత్రికులతో మొదలు పెట్టి 30 వేల మందికి ఉచిత టైం స్లాట్ టోకెన్లు ఇస్తోంది. గతంలో తిరుమలకు వెళ్ళిన వారు నేరుగా క్యూలైన్లలోకి వెళ్ళే వారు. రోజుకు 70వేల మందికి పైగా దర్శనాలు చేసుకునేవారు. ఒక్కో రోజు లక్షమంది భక్తులు కూడా దర్శనం చేసుకున్న సందర్భాలున్నాయి. అలాంటి సందర్భాలలోనూ రెండు రోజుల నుంచి మూడు రోజుల లోపు దర్శనం అయ్యేది. ఎలాంటి పరిస్థితులలోనైనా 72 గంటలు మించకుండా స్వామి దర్శనం చేయించేవారు. అప్పటి వరకు క్యూలైన్ లో భక్తులకు టీటీడీ పాలు, నీళ్ళు, ఉదయం, సాయంత్రం అల్పాహారం అందించేది. క్యూలైన్లు మొదలుకొని కంపార్టుమెంట్లలో వేచి ఉండే భక్తులకు ఏ కొదవా ఉండేది కాదు. కానీ ఇప్పుడు భక్తులు తండోపతండాలుగా వచ్చేయడంతో తొక్కిసలాటలు, తోపులాటలు తప్ప అక్కడ ఎలాంటి ప్రశాంతత లేకుండా పోయింది. కోట్ల రూపాయలు కానుకలిచ్చే భక్తులను పట్టించుకున్న గొప్పగా సామాన్యులను టీటీడీ పట్టించుకోవడం లేదు. ఉచిత దర్శనాల విషయంలో టీటీడీ విధించిన ఆంక్షలు సామాన్య భక్తులను కష్టాలపాలు చేస్తున్నది. ప్రభుత్వం తక్షణమే భక్తుల మొక్కులు సాఫీగా సాగేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం వుంది. (Story: దేవుడా! ఇదేం ఖర్మ! తిరుపతిలో నరకయాతన)
See Also:
ఇకపై హైదరాబాద్ శివారు భూములు బంగారమే!
పసిపాపను చితకబాదిన తల్లి : వీడియో వైరల్
మంత్రివర్గం కీలక నిర్ణయాలు ఇవే!
బాలినేనికి మంత్రిపదవి దక్కకపోవడానికి కారణాలివేనా?
మంత్రుల పేషీల్లోని అధికారులకు షాక్..!
పింఛను డబ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!
చనిపోయాడని పూడిస్తే…బతికొచ్చాడు!
రామ్‌గోపాల్‌వర్మకు ధియేటర్ల షాక్!
స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : కటకటాల్లో టీచర్
రామ్‌చరణ్‌తో బిగ్ డీల్ నిజమేనా?
వావ్! లేపాక్షికి యునెస్కో గుర్తింపు!