Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌తగ్గేదేలేదంటున్న సుచరిత!

తగ్గేదేలేదంటున్న సుచరిత!

తగ్గేదేలేదంటున్న సుచరిత!

Mekathoti Sucharitha: మాజీ హోం మంత్రి సుచరిత తాను ప్రకటించిన మాటకు కట్టుబడి వున్నారు. ఇప్పటివరకైతే తగ్గేదేలేదని స్పష్టంగా చెపుతున్నారు. రాజీనామా రాజీనామానే అని ప్రకటించారు. కాకపోతే వైఎస్‌ఆర్‌సీపీని వదిలిపెట్టేది లేదని ప్రకటించారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే. అయితే అందులో పాతవారిని 11 మందిని కొనసాగించగా, కొత్తగా 14 మందిని తీసుకున్నారు. సుచరితను మాత్రం పక్కనబెట్టారు. ఆమె ఎస్సీ మంత్రి. ఎస్సీ మంత్రులందరినీ కొనసాగించి, తనను మాత్రమే విస్మరించడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నారు. పైగా గుంటూరు జిల్లాలో వైసీపీకి దన్నుగా నిలబడిన వారిలో సుచరిత అండ్‌ ఫ్యామిలీ ఒకరు. మంత్రిపదవి రాకపోవడం కన్నా కొత్తవారికి స్థానమివ్వడం ఆమెకు నచ్చడం లేదు. పైగా వారికింద పనిచేయడానికి ఆమెకు మనస్కరించడం లేదు. ఈ విషయాన్ని సుచరిత సన్నిహితవర్గాలు ఇదివరకే వెల్లడిరచాయి. ప్రస్తుతం సుచరిత బుధవారంనాడు సాయంత్రంలోగా సీఎం వైఎస్‌ జగన్‌తో భేటీ కానున్నారని తెలుస్తోంది. ఇతర సీనియర్‌ నేతలతో సజ్జల, సీఎం జగన్‌ ఇదివరకే చర్చలు జరిపారు. కాకపోతే, ఆమె సీఎంతో భేటీ అవుతారా లేదా అన్నది ఇంకా సస్పెన్స్‌. తనను బుజ్జగించడానికి వచ్చిన ఎంపీ మోపిదేవి చేతికే ఆమె రాజీనామా పత్రాన్ని అందజేశారు. అది స్పీకర్‌ ఫార్మాట్‌లోనే రాసినట్లు సమాచారం. అయితే అదింకా తనకు చేరలేదని స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ వెల్లడిరచారు. ఏదేమైనప్పటికీ, సుచరిత పట్టుదల ఆసక్తిని రేకెత్తిస్తోంది. సీఎం కూడా సానుకూలంగా స్పందిస్తారా? లేదా? అన్నది వేచిచూడాల్సిందే! (Story: తగ్గేదేలేదంటున్న సుచరిత!)

See Also:

ఇకపై హైదరాబాద్‌ శివారు భూములు బంగారమే!

పసిపాపను చితకబాదిన తల్లి : వీడియో వైరల్‌

మంత్రివర్గం కీలక నిర్ణయాలు ఇవే!

ఆ దిష్టిబొమ్మ సీఎం జగన్‌దేనా?

బాలినేనికి మంత్రిపదవి దక్కకపోవడానికి కారణాలివేనా?

మంత్రుల పేషీల్లోని అధికారులకు షాక్..!

పింఛ‌ను డ‌బ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!

చ‌నిపోయాడ‌ని పూడిస్తే…బ‌తికొచ్చాడు!

రామ్‌గోపాల్‌వ‌ర్మ‌కు ధియేట‌ర్ల షాక్‌!

స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : క‌ట‌క‌టాల్లో టీచ‌ర్‌

ఏపీలో పంచాయతీ నిధులన్నీ మాయం!

ఉగాది పచ్చడి ఆరోగ్యకరమేనా?

ఎంత దారుణం : శవంతో సెక్స్‌!

రామ్‌చరణ్‌తో బిగ్‌ డీల్‌ నిజమేనా?

వావ్‌! లేపాక్షికి యునెస్కో గుర్తింపు!

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

మందుబాబులకు హ్యాపీ న్యూస్‌..!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!