అసమ్మతి ‘డ్రామా’లకు తెరపడినట్లే!
మెట్టుదిగిన బాలినేని : సుచరిత రాజీనామా
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అసమ్మతి డ్రామాలకు ఎట్టకేలకు తెరపడింది. ఒక్క సుచరిత మాత్రం రాజీనామా చేశారు. మిగతా వాళ్లంతా ఓ అడుగు వెనక్కి తగ్గారు. ఏపీ సీఎం మంత్రి వర్గ పునర్వవస్థీకరణలో భాగంగా ఎంతోమంది ఆశావహులకు మనస్తాపానానికి గురైన విషయం తెల్సిందే. మంత్రి పదవి రానందుకు అలకబూనారు. దీంట్లో భాగంగానే మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత మనస్తాపం చెందారు. దీంతో సుచరిత ఏకంగా తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. కానీ పైకి మాత్రం తనకు మరోసారి మంత్రి పదవి దక్కలేదని ఏమాత్రం బాధలేదనీ..కానీ కొన్ని విషయాలు తన దృష్టికి వచ్చాయని అవే తనను బాధిస్తున్నాయని..అందుకే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశానని ఆమె చెప్పారు. వ్యక్తిగత కారణాలతోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని..కానీ పదవిలో లేకపోయినా రాజకీయాల్లో ఉన్నంత కాలం జగన్ కోసమే పనిచేస్తానని చెప్పడం విశేషం. నా వల్ల పార్టీకి చెడ్డపేరు రాకూడదని కూడా ఆమె చెప్పుకొచ్చారు. తాజాగా ఈ విషయాన్ని సుచరిత అధికారికంగా ప్రకటించారు. ఇవాళ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆమె తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఎమ్మెల్యే పదవికి మాత్రమే రాజీనామా చేస్తున్నానని, చేశానని కూడా తెలిపారు. కానీ పదవిలో లేకపోయినా పార్టీలో కొనసాగుతానని స్పష్టం చేశారు. పార్టీలోని కార్యకర్తలెవరూ రాజీనామా చేయవద్దని, పార్టీకి నష్టం చేయవద్దని సూచించారు. కానీ ఆమెను నమ్ముకున్న కొంతమంది కార్యకర్తలు మాత్రం అసంతృప్తులను భరించలేక ప్రత్తిపాడులో కొందరు నేతలు పార్టీకి రాజీనామా చేశారు.
మరోవైపు, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మెట్టుదిగారు. ముఖ్యమంత్రితో సమావేశమైన మీదట ఆయన మాట పూర్తిగా మారిపోయింది. మంత్రి పదవి కోసం ఎప్పుడూ అర్రులు చాచింది లేదని చెప్పారు. మంత్రి వర్గ పునర్వవస్థీకరణలో మంత్రి పదవి దక్కకపోవటంతో అలిగిన ఆయన వద్దకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి 3 సార్లు రాయబారం నడిపి చివరకు సోమవారంనాడు ముఖ్యమంత్రితో సమావేశం ఏర్పాటు చేశారు. పదవి లేకపోతే,రాకపోతే రాజీనామా చేసే మనుషులం కాదని ఆయన అన్నారు. మంత్రిపదవి పోతే ఎవరికైనా కాస్త బాధ ఉంటుందని, తాము ఎల్లప్పుడూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీకి, వైఎస్ జగన్‌కు విధేయులమని చెప్పారు. కాగా, అసమ్మతి తెలిపిన మిగతా నేతలు కూడా చల్లబడ్డారు. సో…ఇంతటితో అసమ్మతి ‘డ్రామా’లకు తెరపడినట్లే! (Story: అసమ్మతి ‘డ్రామా’లకు తెరపడినట్లే!)
See Also:
ఏపీ మంత్రుల ప్రమాణ స్వీకారం హైలైట్స్!
బాలినేనికి మంత్రిపదవి దక్కకపోవడానికి కారణాలివేనా?
ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రులు వీరే! (Full Details)
మీడియాపై మంత్రి పేర్ని నాని ఉద్వేగపూరిత వ్యాఖ్యలు
మంత్రుల పేషీల్లోని అధికారులకు షాక్..!
పింఛను డబ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!
చనిపోయాడని పూడిస్తే…బతికొచ్చాడు!
రామ్‌గోపాల్‌వర్మకు ధియేటర్ల షాక్!
స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : కటకటాల్లో టీచర్
రామ్‌చరణ్‌తో బిగ్ డీల్ నిజమేనా?
ఇకపై ఇంటర్వ్యూలు లేకుండానే ఉద్యోగాలు!
వావ్! లేపాక్షికి యునెస్కో గుర్తింపు!