రూ.56తో రోజంతా మెట్రోరైలులో!
హైదరాబాద్ మెట్రోరైల్ సూపర్ సేవర్ ఆఫర్!
హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ నుంచి పంజాగుట్ట వరకు మెట్రో రైలులో ప్రయాణిస్తే అటుఇటుగా 50 రూపాయలు సమర్పించుకోవాల్సి వుంటుంది. కానీ, కేవలం 56 రూపాయలకే రోజంతా మెట్రోలో తిరగొచ్చు. ఆశ్చర్యంగా వుందా? ఇది నిజం! హైదరాబాద్ మెట్రో రైల్ గురువారంనాడు ఈ ప్రకటన జారీ చేసింది. ఇంతకుముందెన్నడూ లేనట్టి అన్‌లిమిటెడ్ ట్రావెల్ ఆఫర్ తీసుకొచ్చింది హైదరాబాద్ మెట్రో రైల్. కాకపోతే, ప్రతి రోజూ కాకుండా, ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారాలు, పబ్లిక్ హాలీడేస్ సమయంలో ఈ ఆఫర్ సూపర్ బెనిఫిట్స్ అందించనుంది. సహజంగానే హైదరాబాద్‌లో చూడదగ్గ ప్రదేశాలు కోకొల్లలు. ఈ నగరంలోనూ లేనన్ని పర్యాటక ప్రాంతాలు భాగ్యనగరంలో వున్నాయి. అందుకే వేసవి సెలవులను ఆనందంగా గడిపేందుకు వీలుగా ప్రయాణికులకు సూపర్ సేవర్ కార్డును అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని సహాయంతో సెలవు రోజుల్లో రూ.59తో రోజంతా మెట్రోలో తిరగొచ్చు. హైదరాబాద్ మెట్రో రైల్లో సూపర్ సేవర్ కార్డును ఎల్ అండ్ టీ ఎండీ కేవీబీ రెడ్డి ప్రారంభించారు. నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా రోజంతా తిరగొచ్చని సూచించారు. మెట్రో వర్గాలు ప్రకటించిన 100 రోజుల సెలవుల్లో ఈ సూపర్ సేవర్ కార్డు ఉపయోగపడుతుంది. ఇది దేశంలో ఏ మెట్రో రైల్ ఇవ్వని అపూర్వమైన ఆఫర్‌గా భావిస్తున్నారు. (Story: రూ.56తో రోజంతా మెట్రోరైలులో!)
See Also: ఐఏఎస్‌లకు జైలుశిక్ష ఎలా వుందంటే!
మేకపాటి గౌతమ్‌రెడ్డి స్థానంలో మంత్రి ఎవరో తెలుసా?
మాకొద్దీ మంత్రిగిరీ! Special Story)
రామ్‌చరణ్‌తో బిగ్ డీల్ నిజమేనా?
క్యాబినెట్ విస్తరణ ముహూర్తం కుదిరింది!
ఇకపై ఇంటర్వ్యూలు లేకుండానే ఉద్యోగాలు!
వావ్! లేపాక్షికి యునెస్కో గుర్తింపు!
రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్ : బడ్జెట్ రూ.800 కోట్లు
ఆ 10 మందికీ మంత్రిపదవులు ఖాయం!)