Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఐఏఎస్‌లకు జైలుశిక్ష ఎలా వుందంటే!

ఐఏఎస్‌లకు జైలుశిక్ష ఎలా వుందంటే!

ఐఏఎస్‌లకు జైలుశిక్ష ఎలా వుందంటే!

అమరావతి : త‌ప్పు చేసిన వారెవ్వ‌రైనా శిక్ష త‌ప్ప‌ద‌ని ఏపీ హైకోర్టు నిరూపించింది. తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు మ‌రో సంచలనాత్మక తీర్పునిచ్చింది. రాష్ట్ర హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన ఎనిమిది మంది ఐఏఎస్‌లకు జైలు శిక్ష విధిస్తూ ధర్మాసనం తీర్పునిచ్చింది. అయితే హైకోర్టుకు ఎనిమిది ఐఏఎస్‌ అధికారులు బేషరతుగా క్షమాపణలు చెప్పారు. పొరపాటు అయ్యిందని, భవిష్యత్తులో ఇలాంటివి పునావృతం కాకుండా చూస్తామని తెలిపారు. ఐఏఎస్‌ల క్షమాపణలను అంగీకరించిన హైకోర్టు జైలుశిక్షకు బదులుగా ఏడాది పాటు ప్రతినెలలో ఒకరోజు సంక్షేమ హాస్టల్‌కు వెళ్లి సేవ చేయాలని ధర్మాసనం ఆదేశించింది. ఏడాది పాటు సంక్షేమ హాస్టల్‌లో ఒక్కపూట భోజనం పెట్టాలని హైకోర్టు పేర్కొంది. ఈ మేరకు సీనియర్ ఐఏఎస్‌లు విజయ్‌కుమార్, శ్యామలరావు, గోపాలకృష్ణ ద్వివేది, బుడితి రాజశేఖర్‌, శ్రీలక్ష్మి, గిరిజాశంకర్‌, వాడ్రేవు చినవీరభద్రుడు, ఎంఎం నాయక్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ధిక్క‌ర‌ణ కేసుల కింద వారికీ శిక్ష‌లు ప‌డ్డాయి.

ఇంత‌కీ ఆ కోర్టు ధిక్కరణ కేసులేంటో తెలుసా? : ప్రధానంగా గ్రామ సచివాలయ భవనాలను హైస్కూల్‌ ప్రాంగణాలు, ఇతర ప్రభుత్వ స్థలాల్లో నిర్మించడాన్ని హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వాటిని వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల నేపథ్యంలో హైకోర్టు కోర్టు ధిక్కరణ కేసును నమోదు చేసింది. న్యాయస్థానం ఆదేశాలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై కోర్టు ధిక్కరణ కేసును ఇనీషియేట్ చేసిన ధర్మాసనం గురువారం విచారణను ప్రారంభించింది. విచారణ అనంతరం ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం… రాష్ట్రంలోని ఎనిమిది మంది సీనియర్ ఐఏఎస్ అధికారులకు రెండు వారాల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఆ తరువాత ఐఏఎస్‌లు క్షమాపణలు చెప్పడంతో హైకోర్టు పై విధంగా ఆదేశాలు జారీ చేసింది. ఐఏఎస్ అధికారుల‌కు వ్య‌తిరేకంగా ఇలాంటి తీర్పులు అరుదుగా వ‌స్తుంటాయి. స‌మ‌స్య‌ల‌పై అధికారులు త్వ‌ర‌గా స్పందించాల‌న్న‌దే హైకోర్టు విధించిన ఈ శిక్ష‌ల వెనుక ఉద్దేశ‌మై వుండ‌వ‌చ్చు. (Story: ఐఏఎస్‌లకు జైలుశిక్ష ఎలా వుందంటే!)

See Also: మేకపాటి గౌతమ్‌రెడ్డి స్థానంలో మంత్రి ఎవరో తెలుసా?

మాకొద్దీ మంత్రిగిరీ! Special Story)

See Also: ఎంత దారుణం : శవంతో సెక్స్‌!

రామ్‌చరణ్‌తో బిగ్‌ డీల్‌ నిజమేనా?

జ్వరం టాబ్లెట్‌ రూ. 100

క్యాబినెట్‌ విస్తరణ ముహూర్తం కుదిరింది!

ఇకపై ఇంటర్వ్యూలు లేకుండానే ఉద్యోగాలు!

వావ్‌! లేపాక్షికి యునెస్కో గుర్తింపు!

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

ఆ 10 మందికీ మంత్రిపదవులు ఖాయం!)

మందుబాబులకు హ్యాపీ న్యూస్‌..!

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ అసలు రివ్యూ ఇదే!

మెగాస్టార్ మేడే!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!