పాక్‌లో ఎమర్జెన్సీ!
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ రాజీనామా చేస్తున్నట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే ఈలోగా ఇగోతో తీవ్రంగా కొట్టుమిట్టాడుతున్న ఇమ్రాన్ తన పంతాన్ని నెగ్గించుకునే క్రమంలో ఎట్టి పరిస్థితుల్లోనూ దేశంలో ఎమర్జెన్సీ విధించాలని భావిస్తున్నారు. ఈ దిశగా ఇమ్రాన్ సంచలన నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. మరోవైపు సైన్యం కూడా అప్రమత్తమైంది. గతంలో ఇలాంటి పరిస్థితులు ఎదురైన ప్రతిసారీ సైన్యం తిరుగుబాటు చేసి ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన విషయం తెల్సిందే. ఈసారి కూడా అదే పరిస్థితి తలెత్తినా ఆశ్చర్యపోనవసరం లేదని పాక్ మీడియా ఘోషిస్తోంది. దేశంలో ఇమ్రాన్‌ఖాన్ ఎమర్జెన్సీ విధించడానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారన్న వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం మాత్రం అందడం లేదు. ప్రధాని ఇమ్రాన్ జాతినుద్దేశించి ప్రసంగించిన సందర్భంలోనే ఈ ప్రకటన చేస్తారని వార్తలొస్తున్నాయి. ముందుగా ఆయన పాక్ ఆర్మీ చీఫ్ బాజ్వాతో భేటీ అయ్యారు. మరోవైపు పాక్ ప్రధాని ఇమ్రాన్ ప్రత్యేక మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఇమ్రాన్‌పార్టీకి మద్దతు తగ్గింది. దీంతో ఆయన రాజీనామా అనివార్యంగా చెప్పుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ, పొరుగునున్న పాకిస్థాన్‌లో రానున్న 24 గంటల్లో సంచలన వార్తలు వినవచ్చని భారత మీడియా అంటోంది. (Story: పాక్‌లో ఎమర్జెన్సీ!)
See Also: క్యాబినెట్ విస్తరణ ముహూర్తం కుదిరింది!
ఇకపై ఇంటర్వ్యూలు లేకుండానే ఉద్యోగాలు!
వావ్! లేపాక్షికి యునెస్కో గుర్తింపు!
రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్ : బడ్జెట్ రూ.800 కోట్లు
ఆ 10 మందికీ మంత్రిపదవులు ఖాయం!)