ఫస్ట్ వార్డ్ స్కూల్ నందు పోషకాహార మాసోత్సవాలు
న్యూస్‌తెలుగు/ వినుకొండ : స్థానిక ఫస్ట్ వార్డ్ స్కూల్ నందు పోషకాహార మాసోత్సవాలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సూపర్వైజర్ కే.శ్రీలత అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పౌష్టికాహారంతో రక్తహీనతను నివారించవచ్చని, ముఖ్యంగా గర్భిణీలకు, బాలింతలకు, ఎదిగే పిల్లలకు ప్రభుత్వం పౌష్టికాహారాన్ని అందజేస్తుందని, మధ్యాహ్న భోజన పథకం ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తున్నారని, దీనివల్ల పిల్లలు, మహిళలు రక్తహీనత లోప పోషణను నివారించవచ్చు. తల్లిదండ్రులు, చిన్నపిల్లల ఆరోగ్య పట్ల ప్రత్యేక దృష్టి కనపరచాలని తెలిపారు. పుట్టిన పిల్లలలో డబ్బా పాలు కాకుండా తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి, పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల అనారోగ్యం పాలు గురికాకుండా ఆరోగ్యంగా ఉంటారని , ఆరోగ్యమే మహాభాగ్యము అని తెలిపారు. అందరూ కూడా మాంసాకృత్తులు చిరుధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తీసుకొని ప్రతి ఒక్కరు ఆరోగ్యం కాపాడుకోవాలని అన్నారు. అనంతరం వ్యక్తిగత శుభ్రత పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం మరియు అంగన్వాడీ టీచర్లు జి.విజయ, రేవతి , సుధా, గాయత్రి, సోని, నాగజ్యోతి, మేరీ, సరస్వతి, కనకమ్మా, తదితరులు పాల్గొన్నారు. (Story : ఫస్ట్ వార్డ్ స్కూల్ నందు పోషకాహార మాసోత్సవాలు)