మృతుని ఆచూకీ లభ్యం
హిందూపురం జి ఆర్ పి పోలీసులు
న్యూస్ తెలుగు/ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని రైల్వేటేషన్కు దగ్గరగా డిఎల్ఆర్ కాలనీ సమీపంలో 2023 సంవత్సరం డిసెంబర్ 28వ తారీఖున ఒక మగ వ్యక్తి రైలు కిందపడి మృతి చెందడం జరిగింది. ఈ కేసును హిందూపురం జి ఆర్ పి పోలీసులు చేదించారు. ఈ సందర్భంగా హిందూపురం హెడ్ కానిస్టేబుల్ ఎర్రి స్వామి మాట్లాడుతూ…. చనిపోయిన రోజు మృతుని యొక్క వేలి ముద్రలుతీసి, వేలి ముద్రలో నిపుణులకు పంపగా నిన్నటి దినం అనగా నవంబర్ 8వ తేదీన వే మృతుని యొక్క వివరాలు అందినాయని తెలిపారు. మృతుడు బోయ ఆకుతోట నాగరాజు వయసు 38 సంవత్సరాలు అని, కళ్యాణదుర్గం మండలం పాల్వాయి గ్రామములో నివసిస్తున్నారని తెలిపారు. మృతుడు కళ్యాణ్ దుర్గం పోలీస్ స్టేషన్ లో 2008లో ముద్దాయిగా ఉన్నాడని, తదుపరి శిక్ష పడిన తర్వాత శిక్ష అనుభవించి జైలు నుండి రిలీజ్ కావడం జరిగిందన్నారు, అనంతరం ధర్మవరం చుట్టుపక్కల బేల్దారి పని చేసుకుంటూ జీవించేవాడని తెలిపారు. మృతుని తల్లి రామాంజనమ్మ తమ్ముడు రామ్ చంద్ర స్టేషన్లోకి రాగా ఫోటోలు వివరాలు చూపించడం జరిగిందని, తద్వారా మృతుని వివరాలు తెలిసాయని వారు తెలిపారు. చనిపోయిన వ్యక్తి తన కుమారుడిగా తల్లి గుర్తించిందని తెలిపారు.(Story:మృతుని ఆచూకీ లభ్యం.. హిందూపురం జి ఆర్ పి పోలీసులు)