ట్రాఫిక్ నియమ నిబంధనలు ప్రజలు పాటించాలి..
నూతన ట్రాఫిక్ ఎస్ఐ- ఎస్. వెంకట్ రాముడు
న్యూస్ తెలుగు ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ట్రాఫిక్ నియమ నిబంధనలు తప్పక ప్రజలు పాటించినప్పుడే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉండవని నూతన ట్రాఫిక్ ఎస్ఐ-ఎస్. వెంకటరాముడు తెలిపారు. ఈ సందర్భంగా వారు ధర్మవరం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పదవీ బాధ్యతలను చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ తాను పుట్టపర్తి మహిళ పోలీస్ స్టేషన్ నుంచి బదిలీగా ధర్మవరం ట్రాఫిక్ ఎస్ఐగా అటాచ్మెంట్ గా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు. పోలీస్ స్టేషన్లోని ఉద్యోగుల సమన్వయంతో ట్రాఫిక్ ను నియంత్రణ చేస్తానని తెలిపారు. సీటు బెల్టు, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, మద్యం సేవించి డ్రైవింగ్ చేయరాదని, సెల్ఫోన్తో డ్రైవింగ్ చేయరాదని, మైనారిటీ పిల్లలకు వాహనాలు ఇవ్వరాదని తెలిపారు. ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించని వారందరికీ కూడా జరిమానాలు విధించడం జరుగుతుందని తెలిపారు. పట్టణంలో వాహనదారులు అతివేగంగా వెళ్ళరాదని, బాటసారులను గమనిస్తూ, ముందు వెళ్లే వాహనాలను గమనిస్తూ, సుఖవంతమైన ప్రయాణం చేయాలని తెలిపారు. ట్రాఫిక్ నియమ నిబంధనలు ప్రజల కొరకేనని వారు తెలిపారు. డ్రైవింగ్ చేసే ప్రతి వాహనదారుని వద్ద లైసెన్సు, వెహికల్ కు సంబంధించిన అన్ని ఆధారాలు ఉండాలని తెలిపారు. ఇందులో భాగంగానే తాము తనిఖీ చేసే సమయంలో అవి చూపించాలని తెలిపారు. కాబట్టి ప్రజలు వాహనదారులు ట్రాఫిక్ నియంత్రించుటలో తమ సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. (story : ట్రాఫిక్ నియమ నిబంధనలు ప్రజలు పాటించాలి.. )