నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి
పేదల ఇంటికి నిర్మాణానికి ఐదు లక్షల ఇవ్వాలి
పేదలకి అండగా ఎర్ర జెండా ఉంటుంది
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
న్యూస్ తెలుగు/ధర్మవరం నియోజకవర్గం, ( శ్రీ సత్యసాయి జిల్లా) : నిరుపేదల అందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలని అలాగే ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ధర్మవరం నియోజకవర్గంలోని శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గ బత్తలపల్లి మండల కేంద్రంలో సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోరాట కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సత్యసాయి జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ నిరుపేదలందరికీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చి ,ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల కేటాయించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో పేదలకు ఒక సెంటు స్థలము కూడా ఇవ్వకుండా మోసం చేశారని దుయ్యబట్టారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు లేకుండా మోసం చేశారని మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే పట్టణాల్లోని పేదలకు రెండు సెంట్లు గ్రామాల్లోని పేదలకు మూడు సెంట్లు, ఇంటికి స్థలం కేటాయించి ఇల్లు తామే స్వయంగా నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారని,ఇప్పుడు తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కనుక ఇచ్చిన హామీని తప్పకుండా నెరవేర్చాలని ఆయన అన్నారు . సిపిఐ పార్టీ చూపించిన ఖాళీ స్థలాల్లో ఇంటి పట్టాలు ఇచ్చి, ఇల్లు నిర్మించాలని ఈ విషయంపై గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి దృష్టికి, జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని ప్రసాద్, ధర్మవరం నియోజకవర్గ ఎమ్మెల్యే, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లి పేదలందరికీ ఇంటి స్థలాలు వచ్చేలా కృషి చేస్తామని తెలిపారు. అంతవరకు మా పోరాటాలు ఆగవని వారు స్పష్టం చేశారు. తదుపరి జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ మాట్లాడుతూ గత ప్రభుత్వములో అధికార పార్టీ నాయకులు ఈ మఠం భూమిని ఆక్రమించేందుకు అనేకమంది అనేక ప్రయత్నాలు చేయడం జరిగిందని, కానీ వారి ఆటలు సిపిఐ పార్టీ సాగనివ్వలేదని వారు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలో పేదల కోసం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు ఉద్యమాలు చేస్తున్నామని, హిందూపురము, సోమందేపల్లి ,బత్తలపల్లి, తదితర మండలాలలో ఇంటి స్థలాల కోసం పోరాటం చేయడం జరుగుతోందని తెలిపారు. ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలను కేటాయించి, ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు కేటాయించేంతవరకు తమ పోరాటాలు ఆగమని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శేఖర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కుల్లాయప్ప, ధర్మవరం నియోజకవర్గ కార్యదర్శి మధు, చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణ, సిపిఐ పట్టణ కార్యదర్శి రవికుమార్, పట్టణ సహాయ కార్యదర్శి రమణ, సిపిఐ మండల కార్యదర్శి బండల వెంకటేశులు, మండల వ్యవసాయ కార్మిక సంఘం బత్తుల నాగభూషణం, సన్నా పెద్దన్న, రామకృష్ణ, ఆదినారాయణ, నారాయణస్వామి, రవి, నారాయణ, జయమ్మ, గంగాధర్, సత్యమయ్య, ఓబులేషు, రామాంజనేయులు తదితర సిపిఐ నాయకులు కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.(Story:నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి)