గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారం తీసుకోవాలి
సిడిపిఓ ప్రేమలత
న్యూస్ తెలుగు /ములుగు : కన్నాయిగూడెం మండలం పరిధిలో. సెక్టార్ పరిధిలో ఉన్న,లక్ష్మి పూర్,ముప్పనపల్లి అంగన్వాడి కేంద్రంలో బుధవారం పోషణ మాసం ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందని, ములుగు సిడిపిఓ ప్రేమలత ఒక పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ .ప్రేమలత పాల్గొన్ని మాట్లాడుతూ,ఫొషన్ మాసంలో భాగంగా, అంగన్వాడీ కేంద్రంలో ఉన్న గర్భిణీలు బాలింతలుకు,1000 రోజుల ప్రాముఖ్యత గురించి వివరించారు.ప్రతి గర్భిణీ గర్భం దాల్చిన రోజు నుండి, బిడ్డ పుట్టిన రెండు సంవత్సరాల వరకు, వెయ్యి రోజులు పాటు, ఆహారం తీసుకోవడం వల్ల రక్తహీనతను ఆదిగమించగలరని ఆమె వివరించారు.కేజీబీవీ లోని బాలికలందరిని ఉద్దేశించి, వారికి అందిస్తున్న రాగిజావా తప్పకుండ తాగాలని సూచించారు.
సంపూర్ణత అభియాన్ లోని 6 ఇండికేటర్స్ గురించి చెపుతు 100% గర్భిణీలకు ఏడబ్ల్యూ సి ద్వారా పోషకహారం అందిస్తామని తెలిపారు. పోషణ మాసం కార్యక్రమాల ద్వారా అన్ని గ్రామాలలో ఏడబ్ల్యూ సి నుండి నెల వారీగా పోషకహర, అవగాహనా కార్యక్రమంలు చెప్పడతామణి తెలిపారు. ఆరోగ్యాకరమైన మండలంగా చేయడానికి, హెల్త్ & పంచాయతీ సిబ్బంది, వారఅందరము కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలోఐసిడిఎస్ సూపర్ వైజరు పుస్పవవతి, రవిష్,అంగన్వాడీ టీచర్స్ రజిత,ఖమ్మరునిషా,, సూరమ్మ, తిరుమల పార్వతి, అనిత స్కూల్ టీచర్స్ మదర్స్ పాల్గుగున్నారు. (Story : గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారం తీసుకోవాలి)