30న సీతారామ కళ్యాణం
న్యూస్‌తెలుగు/ విజయనగరం : ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం రామనారాయణంలో ఈనెల 30వ తేదీన సీతారామ కళ్యాణం ,31వ తేదీన శ్రీరామ మహా సామ్రాజ్య పట్టాభిషేకం మహోత్సవం నిర్వహించనున్నట్లు ఎన్ సి ఎస్ ట్రస్ట్ సభ్యులు నారాయణం శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈరోజు ఉదయం ఉత్సవ ఆహ్వాన ప్రతులను ఆవిష్కరించి మాట్లాడుతూ
క్రోధి నామ సంవత్సర శ్రావణ బహుళ పునర్వసు, పుష్యమి నక్షత్రయుత శుక్ర, శనివారాలలో
శ్రీ రామ తవాస్మి దాస బృందం, ఎన్ సి ఎస్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా, సభక్తికంగా శ్రీరామ చరణ కమలాల మ్రోల సమర్పిస్తున్నట్లు పేర్కొన్నారు . అయోధ్య నుండి బయలుదేరిన వెండి శ్రీ రామభాణం శ్రీ శ్రీనివాస చార్యులు ఆధ్వర్యములో మన రామనారాయణం ప్రాంగణంలో ఈ రెండు రోజులు భక్తుల దర్శనార్ధం ఉంచుతారని భక్తులందరూ పాల్గొనాలని కోరారు (Story : 30న సీతారామ కళ్యాణం)