UA-35385725-1 UA-35385725-1

చెయ్యి తడిపితే నిబంధనలతో పనిలేదు..

చెయ్యి తడిపితే నిబంధనలతో పనిలేదు..

ప్లాన్‌ లేకుండా బహుళ అంతస్తుల నిర్మాణం
కొద్ది రోజుల్లో రిటైర్మెంట్‌ కానున్న ఓ ఉన్నతాధికారి దందా..
దీపముండగానే ఇళ్లు సక్కబెట్టుకుంటున్న వైనం
ఫిర్యాదులు వచ్చినా ఏ ఒక్కరిని అటువైపు చూడనివ్వని వైనం
కార్పొరేషన్‌కు భారీ నష్టం..

న్యూస్‌తెలుగు/విజయవాడ : విజయవాడ నగరంలో పలు ప్రాంతాల్లో అనధికారక భవన నిర్మాణాలు ఇష్టారాజ్యంగా పెరిగిపోతున్నాయి. టౌన్‌ప్లానింగ్‌ అధికారుల చెయ్యి తడిపితే నిబంధనలతో పనిలేదు. అనధికార భవన నిర్మాణాలు దందా అంతా ఓ టౌన్‌ప్లానింగ్‌ ఉన్నతాధికారి కనుసన్నల్లో జరిగిపోవటం విశేషం. భవ నిర్మాణదారులు రెండు మూడు ప్లోర్లుకు టౌన్‌ప్లానింగ్‌ నుంచి అనుమతులు తీసుకుని పైఅధికారులకు మామూళ్లు ఇచ్చి అనధికారికంగా మరో ఒకటి రెండు ప్లోర్లు నిర్మిస్తున్నారు. భవనం కట్టే స్థలానికి నిబందనల మేరకు రోడ్డు, సెట్‌ బ్యాక్‌లు లేకున్నా ఇష్టారాజ్యంగా నిర్మించేస్తున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోరు..వీఎంసీ ఫిర్యాదుల విభాగానికి ఫిర్యాదు చేస్తే ఆ విభాగం అనధికారక నిర్మాణాలను ప్రోత్సహించే అధికారి వద్దకే పంపటం విశేషం. దీన్ని ముందుగానే గుర్తించిన కొందరు అవినీతి అధికారులు ఫిర్యాదులను బుట్టదాకలు చేస్తున్నారు. వీఎంసీ సర్కిల్‌`2 కార్యాలయాన్ని అనుకుని ఓ బిల్డరు నిబందనలతో పనిలేకుండా బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు. నిత్యం వీఎంసీ అధికారులు అక్కడే ఉండి కూడా కళ్లు అప్పగించి చూడటం విశేషం. ఫలితంగా నగర పాలక సంస్థ ఖజానాకు చేరాల్సిన ఆధాయం కొందరి స్వార్ధపరుల జేబుల్లోకి వెళ్లటంపై సర్కిల్‌`2 కార్యాలయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వీటి వెనుక త్వరలో రిటైర్మెంట్‌ కాబోతోన్న ఓ ఉన్నతాధికారి హస్తం ఉండటంతో కిందిస్థాయి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవటంలేదనే కార్పొరేషన్‌ వర్గాల్లో పెద్ద ఎత్తున గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇప్పటికైనా కొత్తగా వచ్చిన నగరపాలక సంస్థ కమిషనర్‌ తక్షణం ఆయనే స్వయంగా పరిశీలించి చర్యలు తీసుకుంటారో..లేదో..వేచి చూడాల్సి ఉంది.
ఇవే అనధికారిక, అవినీతి అంతస్తులు..
నగర పాలక సంస్థకు చెందిన సర్కిల్‌`2 కార్యాలయం వెనుక భాగంలో ఓ బిల్డరు స్టిల్ట్‌GజీG2 వీఎంసీ టౌన్‌ప్లానింగ్‌ నుంచి అనుమతులు తీసుకుని పైన ఎలాంటి ప్లాన్‌ లేకుండా స్టిల్ట్‌GజీG4 నిర్మిస్తున్నారు. వీఎంసీ కార్యాలయం పక్కనే అనధికారక భవన నిర్మాణాలు జరిగినా అటువైపు అధికారులు కన్నెత్తి చూడకపోవటంపై పలు అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. అయినా ఓ ఒక్క అధికారి స్పందించకపోవటంతో దీనిపై స్థానికులు పలు మార్లు ఫిర్యాదుల విభాగానికి, సంబందిత అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా సదరు బిల్డరు యదేశ్చగా అనధికారిక అంతస్తు నిర్మిస్తున్నారు. దీని వల్ల కార్పొరేషన్‌కు లక్షలాది రూపాయిలు అధాయానాకి గండి పడిరది. మరో భారీ అవినీతిని పరిశీలిస్తే..25వ డివిజన్‌ సీతారామపురంలోని వీరమాచనేని రంగారావు వీధిలో ఓ బిల్డర్‌ స్టిల్ట్‌GజీG2కు అనుమతులు తీసుకుని అధికారులకు మామూళ్లు ముట్టజెప్పి పైన అనధికారక అంతస్తు నిర్మాస్తున్నారు. నిబందనల మేరకు వాణిజ్య ప్రాంతమైన ఈ ఏరియాలో కార్పొరేషన్‌కు చెల్లించాల్సిన పన్నులు చెల్లిస్తే లక్షలు ఆధాయం వచ్చేదని స్థానికులు చర్చించుకోవటం విశేషం. గజం ఐదారు లక్షలు పలికే మరో వాణిజ్య ప్రంతమైన బీసెంట్‌ రోడ్‌కు అనుసందానంగా ఉన్న రోడ్డులో మార్వాడి గుడి వద్ద కార్పొరేషన్‌ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా పై అంతస్తు నిర్మాస్తున్నారు. ఇలా నగరంలో కోకోల్లలుగా అనధికారిక నిర్మాణాలు జరుగుతుంటే ఏ ఒక్క అధికారికి పట్టకపోవటంపై రాష్ట్ర ప్రభుత్వమే స్పందించి చర్యలు తీసుకుని కార్పొరేషన్‌కు ఆధాయాన్ని పెంచాలని నగర ప్రజలు కోరుతున్నారు.
ఇళ్లు సక్కబెట్టుకుంటున్న ఓ టౌన్‌ప్లానింగ్‌ ఉన్నతాధికారి..
సర్కిల`2లో జరుగుతన్న అనధికారక భవన నిర్మాణాల వెనుక త్వరలో రిటైర్మెంట్‌ కాబోతోన్న ఓ టౌన్‌ప్లానింగ్‌ అధికారి చక్రం తిప్పుతున్నట్లు తెలిసింది. దీపం ఉండగానే ఇళ్లు సక్కబెట్టుకోవాలన్న సామెత ప్రకారం అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికారంలో ఉన్న కొన్ని రోజుల్లోనే లక్షలు సంపాదించేందుకు పథకం పన్ని దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నట్లు ఆఫీసు వర్గాలు చర్చించుకుంటున్నాయి. సర్కిల్‌`2 కార్యాలయం పక్కనే నిర్మిస్తున్న అనధికారక భవనం పైఅంతస్తు విషయంమై గతంలో ఇక్కడ పని చేసిన బల్డింగ్‌ ఇనస్పెక్టర్‌ రెండు సార్లు నిర్మాణాన్ని అడ్డుకుని తొలిగించారు. అయితే తన పని సక్కపెట్టుకునేందుకు సంబందిత టౌన్‌ప్లానింగ్‌ ఉన్నతాధికారి బిల్డింగ్‌ ఇనస్పెక్టర్‌ను అక్కడి నుంచి బదిలీ చేయించారు. తరువాత ఆయనే నేరుగా బేరం కుదుర్చుకుని కార్యాలయం పక్కనే లక్షలు దండుకోవటం నగరంలో చర్చనీయ అంశంగా మారింది. ఈ ఒక్క ప్లోర్‌కు సంబందిత యజమాని వద్ద రూ.8లక్షలు పుచ్చుకున్నట్లు సమాచారం. అదే విదంగా సీతారామపురంలో అనధికారక అంతస్తు నిర్మాణానికి రూ.6లక్షలు, బీసెంట్‌ రోడ్‌లో అనధికారిక భవన నిర్మాణానికి రూ.5లక్షలు వసూలు చేసినట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. ఈయన కాకుండా కిందిస్తాయి అధికారులు కూడా కొందరు సదరు యజమానుల వద్ద అక్రమ వసూళ్లు చేసిన తెలిసింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1