స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో మంచి అభివృద్ధి జరుగుతుంది
రైల్వే స్టేషన్ మాస్టర్ నరసింహనాయుడు
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో మంచి అభివృద్ధి, మంచి పరిశుభ్రత, చక్కటి ఆరోగ్యం లభిస్తుందని రైల్వే స్టేషన్ మాస్టర్ నరసింహా నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా వారు రైల్వేటేషన్ లో స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాన్ని జెండా ఊపి వారు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ స్వచ్ఛతాహి సేవా కార్యక్రమం ఈనెల 14 నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు వివిధ రూపాలలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వాళ్ళు తెలిపారు. ర్యాలీలో రైల్వే ప్రయాణికులకు ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రతి రైల్వే ఉద్యోగి స్వచ్ఛతహి సేవ కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా సహాయ సహకారాలను అందించాలని వారు తెలిపారు. స్వచ్ఛత రైల్వే స్టేషన్గా మార్పు చేసేందుకు ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు ఎంతో అవసరమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టేషన్ మాస్టర్లు నరసింహ నాయుడుతోపాటు మస్తాన్వలి, చీఫ్ హెల్త్ ఇన్స్పెక్టర్ దామోదర మూర్తి, కమర్షియల్ సూపర్వైజర్ ముద్ధన్న, వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ శివశంకర్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఆపరేటింగ్, కమర్షియల్, క్లీన్ స్టాప్ సిబ్బంది పాల్గొన్నారు. (Story : స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో మంచి అభివృద్ధి జరుగుతుంది)