UA-35385725-1 UA-35385725-1

మంత్రిగారు మా జీతాలు 14 లక్షల ఇప్పించండీ..?

మంత్రిగారు మా జీతాలు 14 లక్షల ఇప్పించండీ..?

చనుబండ గ్రీన్ అంబాసిడర్స్ ఆవేదన

న్యూస్ తెలుగు /చాట్రాయి : ఆనాటి వైసిపి పెత్తందారులు….. పంచాయితీ అధికారి కుమ్మక్కై …. చనుబండ చెత్త సంపద తయారీ కేంద్రంలో గ్రీన్ అంబాసిడర్లుగా పనిచేస్తున్న 6 మంది కార్మికులం దళితులం రెక్కాడితే గాని డొక్కనిండని మమ్ములను తీసేసి మాకు ఇవ్వాల్సిన జీతం 39 నెలల రెక్కల కష్టాన్ని అక్రమ పద్ధతిలో తినేశారని మంత్రి సారది మాకు డబ్బులు ఇప్పిస్తారని ఆశపడుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ పేరును అడ్డంపెట్టి కూలీలను పనిలో నుంచి తీసివేసి వారికి వచ్చిన 14 లక్షల రూపాయల జీతాన్ని వేరే వారికి ఇచ్చిన అధికారికి కొంతమంది అధికార పార్టీ నాయకులు కొమ్ము కాయడంతో మరోసారి చనుబండ చెత్త సంపద తయారీ కేంద్రంలో జరిగిన అవినీతిపై చర్చలు మొదలయ్యాయి. మంగళవారం సాయంత్రం బాధితులు విశాలాంధ్ర తో తమ గోడు వెళ్ళబుచ్చుకున్నారు. చాట్రాయి మండలం లోనే అతిపెద్ద గ్రామమైన చనుబండ లో 2019 తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చెత్త సంపద తయారీ కేంద్రం మంజూరు చేశారు. లో పనిచేయడానికి గ్రామంలోని ఆరు మందిని గ్రీన్ అంబాసిడర్ గా నియమించారు.2019 నుంచి 41 నెలలపాటు కరోనా సమయములో కూడా అందులో పని చేస్తూ ఒక మహిళా కార్మికురాలు మృతి చెందినప్పటికీ వారు విడవకుండా పనిచేసామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెల 6000 జీతం చొప్పున 2019 జనవరి నెలలో ఒకసారి 2020 ఫిబ్రవరి నెలలో ఒక్కసారి మా ఖాతాలలో డబ్బులు వేశారని ఆ తదనంతరం మాకు వచ్చిన జీతం డబ్బులను మాకు ఇవ్వకుండా పంచాయతీ కార్యదర్శులు నాగరాజు వైసీపీ నాయకులతో కలిసి మాపై కుట్రపన్ని మాకు జీతాలు ఇవ్వకుండా మాకు చెప్పకుండా మా స్థానంలో వేరే వారిని నియమించి 14 లక్షల 4 వేల రూపాయలను అక్రమ పద్ధతిలో మార్చుకున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రసాద్ అనే కార్మికుడు మాట్లాడుతూ. ఈసమస్య పైన మేము ఆనాటి నుండి ఈనాటి వరకు పోరాటం చేస్తూనే ఉన్నామని నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన దీక్ష కార్యక్రమాలు చేపట్టామని జిల్లా కలెక్టర్ వారికి ఫిర్యాదు చేశామని ఆనాటి జిల్లా పంచాయితీ అధికారి స్వయంగా చనుబండకు వచ్చి విచారించారని అందరూ మా జీతాలు మాకు ఇవ్వమని పంచాయతీ కార్యదర్శి నాగరాజుకు ఎన్నిసార్లు చెప్పినా చెవిటి వాడి ముందు శంకు ఊదినట్లు ఉంది తప్ప మా జీతాలు ఒక్క రూపాయి బిళ్ళ కూడా ఇవ్వలేదు అన్నారు. బలహీన వర్గాలకు చెందిన మంత్రి సారధి గారు ఎన్నికల ప్రచారంలో చనుబండలో బలహీనవర్గాల నివాస ప్రాంతంలో రాత్రివేళ బస్స చేయడం దళితులు బలహీన వర్గాల వారికి వెన్ను దన్నుగా నిలుస్తానని మాట ఇవ్వడం ఆయన మాటలు నమ్మిన మేమంతా ఆయనకు వెన్నుదన్నుగా నిలిచామని గెలిచిన తర్వాత కూడా ప్రజలకు సేవలు అందిస్తానని చెప్పడంతో ఆయనపై మాకు చాలా నమ్మకం ఉందని తీరా చూస్తే కొంతమంది నాయకులు వ్యక్తిగత ప్రాపకం కోసం వాస్తవాలు మంత్రిగారికి తెలియనివ్వకుండా మాకూలి డబ్బులను నాయకులతో కలిసి అవినీతికి పాల్పడి అక్రమ పద్ధతిలో మా డబ్బులు దోచుకున్న నాగరాజుకి ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం కొంతమంది వత్తాసు పలకడం చాలా బాధాకరంగా ఉందన్నారు. మంత్రి సారధి గారు వాస్తవాలను గుర్తించి నాగరాజు మా డబ్బులు పద్నాలుగు లక్షల నాలుగు వేల రూపాయలు తీనేసారని మా కష్టార్జితం మాకు ఇప్పించి మంత్రిగారు పేదల పక్షాన నిలబడాలని కోరుకుంటున్నామన్నారు. ఆరు మందిలో ఇద్దరు చనిపోయిన కనీసం వారికి కనికరం కూడా లేదన్నారు. మా కూలి డబ్బులు మాకు ఇవ్వడం లేదన్నారు. ఇదే సమస్యపై మొన్న సోమవారం స్పందనలో మరోసారి ఫిర్యాదు చేశామని అన్నారు.(Story : మంత్రిగారు మా జీతాలు 14 లక్షల ఇప్పించండీ..?)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1