UA-35385725-1 UA-35385725-1

ప్రొడక్షన్ నెం 1 రెగ్యులర్ షూటింగ్ ఈరోజు ప్రారంభం

ప్రొడక్షన్ నెం 1 రెగ్యులర్ షూటింగ్ ఈరోజు ప్రారంభం

న్యూస్‌తెలుగు/హైద‌రాబాద్ సినిమా: హీరో నాగ శౌర్య తన నూతన చిత్రాన్ని అనౌన్స్ చేశారు. డెబ్యుటెంట్ రామ్ దేశిన (రమేష్) దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని శ్రీ వైష్ణవి ఫిలింస్ బ్యానర్‌పై న్యూకమ్మర్ శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్నారు. ఈ నూతన చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు ప్రారంభమైయింది.
డైరెక్టర్ రమేష్, ప్రముఖ దర్శకులు గౌతమ్ వాసుదేవ్ మీనన్, వైవిఎస్ చౌద, శ్రీను వైట్ల వద్ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశారు. అనేక విజయవంతమైన చిత్రాలకు సహ రచయితగా పనిచేశారు.
యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందే ఈ చిత్రంలో సముద్రఖని, రాజేంద్ర ప్రసాద్, సాయికుమార్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్‌కుమార్‌లతో సహా ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి టాప్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ డీవోపీగా పనిచేస్తుండగా హారిస్ జయరాజ్ తెలుగు సినిమాకి కంబ్యాక్ ఇస్తూ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌ను రాజీవ్ నాయర్ పర్యవేక్షించగా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ గా పని చేస్తున్నారు.
నటీనటులు: నాగ శౌర్య, సముద్రఖని, రాజేంద్ర ప్రసాద్, సాయికుమార్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్ కుమార్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, పృథ్వి, అజయ్, ప్రియ, నెల్లూరు సుదర్శన్, కృష్ణుడు, చమక్ చంద్ర, శివన్నారాయణ.  (Story : ప్రొడక్షన్ నెం 1 రెగ్యులర్ షూటింగ్ ఈరోజు ప్రారంభం)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1