సమగ్ర యువజన విధానంతోనే ఉపాధి అవకాశాలు
నిరుద్యోగం పెంచుతున్న మోడీ ప్రభుత్వం
ఏఐవైఎఫ్ జాతీయ మాజీ కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య
ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నక్కి లెనిన్ బాబు
న్యూస్ తెలుగు /వినుకొండ : మోడీ ప్రభుత్వం దేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కరించడంలో ఘోరంగా విఫలం కావడంతో పాటు నిరుద్యోగం రికార్డ్ స్థాయిలో పెంచుతున్నారని, సమగ్ర యువజన విధానం ద్వారా నిరుద్యోగ సమస్య నిర్మూలించవచ్చని ఏఐవైఎఫ్ మాజీ జాతీయ కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య అన్నారు. మంగళవారం వినుకొండలో శివయ్య స్తూపం వద్ద జరిగిన ఏఐవైఎఫ్ పల్నాడు జిల్లా ప్రధమ మహాసభ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ముఖ్యఅతిథిగా హాజరైన ఈశ్వరయ్య ఏఐవైఎఫ్ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీని అమలు చేయకపోవడంతో దేశంలో నిరుద్యోగం రికార్డ్ స్థాయిలో రోజు రోజు పెరుగుతుందని, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ మూసివేస్తూ ప్రైవేటీకరణ చేస్తున్న మోడీ ప్రభుత్వం వ్యతిరేకంగా యువత ఉద్యమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఉద్యోగాలు కల్పించండి అంటే నిరుద్యోగులపై లాఠీచార్జి చేస్తూ అక్రమ కేసులు బనాయించడం సిగ్గుచేటని, దేశ అభివృద్ధిలో యువతకు భాగస్వామ్యం కల్పించకుండా కార్పొరేట్ వ్యక్తులకు అప్పగించడం , దేశ సంపదంత కూడా ఆదాని కి దోచిపెడుతున్నారని విమర్శించారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నక్కి లెనిన్ బాబు మాట్లాడుతూ లౌకిక రాజ్యం ద్వారానే బలహీన వర్గాలకు ఉపయోగం జరుగుతుందని, మోడీ రాజ్యాంగ మార్పు కోసం కుట్ర వేస్తూ, కేంద్ర హోం శాఖ మంత్రి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై అనిత వ్యాఖ్యలు చేయడం నిదర్శనం అని అన్నారు.
ధనవంతుల సంపద పున పంపిణీ చేయాలి..
ప్రభుత్వంతో రాయితీలు తీసుకొని కోట్లాది రూపాయలు ప్రజల సొమ్మును దోచుకుంటున్న ధనవంతుల సంపదను ప్రజలకు పంపిణీ చేయాలని నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రచార నిర్వహిస్తామని తెలిపారు. మోడీ విధానాల ద్వారానే కార్పొరేట్లు రోజురోజుకి కోట్లాది రూపాయలు ఆదాయం పొందుతున్నారని విమర్శించారు. ధనవంతులకు బ్యాంకు రుణాలు రుణమాఫీ చేస్తూ ప్రజలపై భారం మోపడం సిగ్గుచేటు అన్నారు.
రాజధాని అమరావతి ఫ్రీ జోన్ చేయాలి.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఫ్రీ జోన్ చేసి అక్కడ భర్తీ చేసే ఉద్యోగాల్లో 26 జిల్లాల నిరుద్యోగులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. కోట్లాది రూపాయలతో అమరావతి అభివృద్ధి చేస్తున్నారని, రాజధాని అన్ని ప్రాంతాల ప్రజలకు సంబంధించింది కాబట్టి అక్కడ భర్తీ చేసే ఉద్యోగాలు కూడా అందరికీ భాగస్వామ్యం ఉండాలని, గతంలో హైదరాబాద్ ఫ్రీ జోన్ కావడం ద్వారా రాష్ట్రవ్యాప్త నిరుద్యోగులకు లబ్ధి చేకూరుతుందని అన్నారు.
శ్రీకాకుళంలో 22వ రాష్ట్ర మహాసభలు
అఖిలభారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ 22 రాష్ట్ర మహాసభలో ఫిబ్రవరి 6 నుండి 9వ తేదీ వరకు శ్రీకాకుళం నగరంలో నిర్వహిస్తున్నట్లు లెనిన్ బాబు తెలిపారు . ఫిబ్రవరి 6 న వేలాదిమంది నిరుద్యోగులతో ప్రదర్శన బహిరంగ సభ , 7 ,8,9 ప్రతినిధి ల మహాసభ నిర్వహిస్తామని , మహాసభల్లో సమగ్ర యువజన విధానం ,వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, ప్రభుత్వ రంగ సంస్థలపరిరక్షణ, ప్రభుత్వ రంగంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల నూతన నోటిఫికేషన్ల , వివిధ అంశాలపై చర్చించి భవిష్య ఉద్యమ కార్యచరణ రూపొందిస్తామని తెలిపారు. ఏఐవైఎఫ్ పల్నాడు జిల్లా కన్వీనర్ షేక్ సుభాని అధ్యక్షతన జరిగిన ఈ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఏ.మారుతి వరప్రసాద్,సహాయ కార్యదర్శులు షేక్ హుస్సేన్, కాసా రాంబాబు,సీపీఐ వినుకొండ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు,చిలకలూరిపేట సీపీఐ కార్యదర్శి తాళ్లూరి బాబురావు,మాచర్ల సీపీఐ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి,మహిళా సమాఖ్య జిల్లా నాయకురాలు చెరుకుపల్లి నిర్మల, ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు యం.సుబ్బారావు, ఏఐవైఎఫ్ చిలకలూరిపేట కార్యదర్శి మల్లికార్జున్,పట్టణ కన్వీనర్ రాంబాబు, వినుకొండ ఏఐవైఎఫ్ కార్యదర్శి అజయ్,గురజాల నియోజకవర్గం ఏఐవైఎఫ్ కార్యదర్శి ప్రత్తిపాటి నాగరాజు, మాచర్ల ఏఐవైఎఫ్ కార్యదర్శి రంగ స్వామి, పెద్ద ఎత్తున ఏఐవైఎఫ్ కార్యకర్తలు పాల్గొన్నారు. (Story : సమగ్ర యువజన విధానంతోనే ఉపాధి అవకాశాలు)