వాసవి క్లబ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం
న్యూస్‌తెలుగు/ విజయనగరం : సమాజసేవలో వాసవి క్లబ్ దే ప్రధమ స్థానమని డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి అన్నారు. మంగళవారం ఎస్. వి. ఎన్.హోటల్ లో జరిగిన వాసవి క్లబ్ 2025 నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకార మహోత్సవానికి శ్రావణి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఆర్యవైశ్యలు తాము సంపాదించిన మొత్తములో సమాజసేవ కోసం వినియోగిస్తారని, అందుకే సమాజంలో వారికి గౌరవం లభిస్తుందన్నారు. ఇదే బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని అన్నారు. మరో ముఖ్య అతిధి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అడ్మినిష్ట్రటివ్ వైస్ డైరెక్టర్ పేర్ల మహేష్ మాట్లాడుతూ విజయనగరం వాసవి క్లబ్ 2024 లో ఇంటర్నేషనల్ నుండి 6 అవార్డులు పొందినట్లు చెబుతూ, కొత్త కమిటీ అదే స్ఫూర్తి తో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి అవార్డులు పొందాలని అన్నారు. అనంతరం గవర్నర్ కుసుమంచి వెంకట్రావు క్లబ్ అధ్యక్షుడు విజ్జపు విజయ్ కుమార్, కార్యదర్శి కంచర్ల వెంకటస్వామి, కోశాధికారి వజ్రపు కృష్ణారావు, వాసవి క్లబ్ వనిత అధ్యక్షురాలు గా కె.రమాదేవి,కోశాధికారి ఏ. విశాలక్ష్మి మరియు ఉపాధ్యక్షులు,సహాయ కార్యదర్శులుచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఆలవెల్లి శేఖర్, చెన్నా బుచ్చి జనార్ధనరావు,రత్నారావు, డిమ్స్ రాజు, పెదబాబు, సముద్రాల నాగరాజు, సన్యాశిరావు, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. (Story : వాసవి క్లబ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం)