రాష్ట్రస్థాయి సెపక్ తక్రా పోటీల్లో విజయనగరం క్రీడాకారుల ప్రతిభ
న్యూస్ తెలుగు/విజయనగరం : జనవరి 16, 17వ తేదీల్లో ప్రకాశం జిల్లా పొదిలిలో జరిగిన 28వ జూనియర్ సెపక్ తక్రా రాష్ట్రస్థాయి బాల, బాలికల పోటీల్లో విజయనగరం జిల్లా బాలికలు యూ. కావ్యాంజలి, కె.అశ్వని, రీతుసాయి. పవిత్ర , ఎస్ .చాందినిలు అద్భుతమైన ప్రతభ కనబరిచి 16 జిల్లా జట్లు పాల్గొన్న రాష్ట్ర స్థాయి బాలికల విభాగంలో విజయనగరం జట్టు 3వస్థానం కైవసం చేసుకుంది. విజేతలకు ఒలంపిక్ అద్యక్ష,కార్యదర్శులు గురాన అయ్యలు, సి.హెచ్ వేణుగోపాలరావు, సెపక్ తక్రా కార్యదర్శి ఎంటి రాజేష్ , ట్రెజరర్ పి.భవాని అభినందించారు చారు. వీరికి కె.జి.జివి గంట్యాడ పాఠశాల పి.ఇ.టిగా పనిచేస్తున్న పి. భవాని శిక్షణ ఇచ్చారు.(Story : రాష్ట్రస్థాయి సెపక్ తక్రా పోటీల్లో విజయనగరం క్రీడాకారుల ప్రతిభ )