సన్‌ఫీస్ట్ పోషకాహార ‘సూపర్ ఎగ్`మిల్క్’ బిస్కెట్ విడుదల
న్యూస్‌తెలుగు/హైదరాబాద్: పోషకాహారాన్ని అందించడంలో భాగంగా పాలు, గుడ్లను పిల్లలకు మరింత ఆకర్షణీయంగా చేయడంలో ఐటిసి సన్ ఫీస్ట్ సూపర్ ఎగ్ మిల్క్ బిస్కెట్‌ను విడుదల చేసింది. దీనిలోని సవాళ్లపై ఐటిసి సన్ ఫిస్ట్ వివిధ రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులతో కూడిన పెద్ద చర్చా కార్యక్రమం నిర్వహించారు. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ (నెక్ )చైర్మన్ మదన్ మోహన్ మైతీ, ఐడిఏ ఈస్ట్ జోన్ వైస్ చైర్మన్ డాక్టర్ దులాల్ చంద్ర సేన్, క్లినికల్ న్యూట్రిషనిస్ట్ లైఫ్ స్టైల్ కన్సల్టెంట్ డాక్టర్ అనన్య భౌమిక్, సెలబ్రిటీ మామ్ కొనినికా బెనర్జీ, నరిషింగ్ స్కూల్స్ సహ వ్యవస్థాపకులు సీఈఓఅర్చన సిన్హా పాల్గొన్నారు. పిల్లల అభివృద్ధి చెందుతున్న సంవత్సరాల్లో గుడ్డు పాలు రెండూ చాలా కీలకమని అభిప్రాయపడ్డారు. విటమిన్లు ఎ,డి,ఇ,ఐరన్ మొదలైన అనేక ఇతర పోషకాలతో కూడిన ప్రోటీన్‌కు మూలం అని వెల్లడిరచారు. పాలు, గుడ్డు వినియోగం పిల్లలకు మరింత ఉత్తేజాన్ని అందించేలా వినూత్న మార్గాలను ప్యానెల్ చర్చించింది. (Story : సన్‌ఫీస్ట్ పోషకాహార ‘సూపర్ ఎగ్`మిల్క్’ బిస్కెట్ విడుదల)