UA-35385725-1 UA-35385725-1

చేనేత సమస్యల పరిష్కారం కోసం తరలిరండి

చేనేత సమస్యల పరిష్కారం కోసం తరలిరండి

ఈనెల 19న చేనేత జౌళి శాఖ మంత్రితో ఆత్మీయ సమావేశం
కలిసికట్టుగా, ఐక్యమత్యంతో చేనేత కార్మికులు, చేనేత వ్యాపారస్తులు పెద్ద ఎత్తున తరలిరండి
ముఖ్య అతిథులుగా ఏపీ రాష్ట్ర చేనేత జౌలి శాఖ మంత్రి సవిత, ఆరోగ్య శాఖామంత్రి సత్య కుమార్ యాదవ్, కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ 

న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్యసాయి జిల్లా) : చేనేత సమస్యల పరిష్కారం కోసం ఈనెల 19వ తేదీన పట్టణంలోని మారుతీ రాఘవేంద్ర స్వామి కళ్యాణ మండపంలో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నామని, ఈ ఆత్మీయ సమావేశానికి చేనేత జౌలీ శాఖ రాష్ట్ర మంత్రి సవిత, ఆరోగ్య శాఖామంత్రి సత్య కుమార్ యాదవ్, కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ రానున్నారని పట్టు చీరల తయారీ, వ్యాపారస్తుల సంఘం అధ్యక్షులు గిర్రాజు రవి, జాతీయ చేనేత నాయకురాలు సంకారపు జయశ్రీ, గౌరవ అధ్యక్షులు కలవల రాంకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్బిఐ కాలనీలోని జయశ్రీ స్వగృహంలో విలేకరుల సమావేశాన్ని వారు ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ 2047 లో అభివృద్ధి పథంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూసుకు వెళుతున్నారని, ఇందులో భాగంగానే వ్యవసాయం తర్వాత చేనేత పరిశ్రమ రెండవ స్థానంలో దేశంలో ఉందని, ఈ చేనేత పరిశ్రమను అన్ని రకాలుగా ఆదుకునేందుకు భద్రత కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృత నిక్షయముతో ఉన్నారని, ముఖ్యమంత్రి కార్యాలయం ద్వారా చేనేత మంత్రికి తగిన ఆదేశాలు వచ్చినందున ఈనెల 19వ తేదీన ఆత్మీయ సమావేశాన్ని మారుతి రాఘవేంద్ర కళ్యాణ మండపంలో మధ్యాహ్నం రెండున్నర గంటలకు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. చేనేత కార్మికులు చేనేత పరిశ్రమ జీవన విధానమును మెరుగుపరుచుటకు నేరుగా చేనేత కార్మికులతో, చేనేత వ్యాపారస్తులతో మాట్లాడటం జరుగుతుందని తెలిపారు. చేనేత మంత్రితో మన సమస్యలు తెలుపుకున్న తర్వాత వారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లి అభివృద్ధి బాటలో ధర్మవరం నడిచేందుకు కృషి చేస్తారని వారు తెలిపారు. గతంలో ఇటువంటి మంత్రితో ఆత్మీయ సమావేశం ఎప్పుడు జరగలేదని, కావున ధర్మవరం ప్రజలు, చేనేత కార్మికులు, వ్యాపారస్తులు తదితర సంస్థలు పెద్ద ఎత్తున తరలి వచ్చినప్పుడే మన సమస్యలు పూర్తి దశలో పరిష్కారం అయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈ ఆత్మీయ సమావేశం అభివృద్ధికి బాట అవుతుందని, భవిష్యత్తుకు మరింత పునాది ఉండే అవకాశం ఉందని తెలిపారు. భవిష్యత్తులో చేనేతను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత నేడు అందరిమీద ఉంది అని వారు గుర్తు చేశారు. అంతేకాకుండా వ్యాపార పరంగా నేడు ధర్మవరం తీవ్ర సంక్షోభంలో ఉంది అని, వందల సంవత్సరాలుగా ధర్మారంలో చేనేత పరిశ్రమలు నమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు. చేనేత కార్మికుల ఆత్మహత్యల పరంపరను నివారించాల్సిన బాధ్యత అందరిమీద ఉందని తెలిపారు. రాజకీయ అండదండలతో పాటు ప్రభుత్వం కూడా మనకు అండలు ఉన్నప్పుడే కార్మికులకు, వీవర్స్ కు, వ్యాపారస్తులకు న్యాయం జరిగే అవకాశం ఉందని తెలిపారు. మన సమస్యలను ఒక వినతి పత్రం ద్వారా చేనేత మంత్రి సవితమ్మకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. రైతులకు ప్రభుత్వం ఇస్తున్న రాయితీలను చేనేత పరిశ్రమ కూడా ఇవ్వాలని వారు తెలిపారు. అభద్రతాభావంతో నేడు ధర్మవరం పట్టణ వ్యాపారస్తులు వ్యాపారం చేస్తున్నారని తెలిపారు. ఎదుగుదల లేక, వేరే వృత్తి చేతకాక ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నామని తెలిపారు. కావున ఈనెల 19వ తేదీన చేపట్టిన ఆత్మీయ సమావేశానికి పట్టణంలోని చేనేత కార్మికులు, వ్యాపారస్తులు, పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలా ప్రభాకర్, పల్లా నవీన్ కుమార్, గడ్డం పార్థసారథి, నీలూరి శ్రీనివాసులు, గిర్రాజు శశిధర్, గుండా పుల్లయ్య, గుద్ధటీ రాము తదితరులు పాల్గొన్నారు. (Story : చేనేత సమస్యల పరిష్కారం కోసం తరలిరండి)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1