ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ త్రైమాసిక వృద్ధి 21% పెరుగుదల
న్యూస్‌తెలుగు/ముంబై: ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, జూన్ 30, 2024తో ముగిసిన త్రైమాసికానికి తమ ఆర్థిక ఫలితాలను వెల్లడిరచింది. మొదటి త్రైమాసికంలో అద్భుతమైన పనితీరుతో, కంపెనీ రాబోయే సంవత్సరంలో బలమైన వృద్ధికి సిద్ధంగా ఉంది. నిర్వహణలో ఉన్న ఆస్తులు 30 జూన్ 2023 నాటికి రూ. 17,947 కోట్ల నుండి 30 జూన్ 2024 నాటికి 21% వృద్ధితో రూ. 21,726 కోట్లకు చేరాయి. మొత్తం రుణ ఖాతాల సంఖ్య 2,74,000ంకి చేరుకుంది. క్యూ1ఎఫ్‌వై25లో పన్ను తర్వాత లాభం 37% పెరిగి రూ. 200 కోట్లకు చేరుకుంది. ఆస్తులపై రాబడి 4.1% వద్ద ఉండగా, ఈక్విటీపై రాబడి 15.9% వద్ద వుంది. ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఎండి, సీఈఓ రిషి ఆనంద్ మాట్లాడుతూ, హౌసింగ్ ఫైనాన్స్ పరిష్కారాలను అందుబాటులోకి తీసుకురావడం, సరసమైనదిగా చేయడంపై దృష్టి సారించడంతో ఈ డైనమిక్ మార్కెట్‌లో గణనీయమైన వృద్ధిని సాధించడం ద్వారా ఈ త్రైమాసికాన్ని ముగించినట్లు తెలిపారు. (Story : ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ త్రైమాసిక వృద్ధి 21% పెరుగుదల)