అంబేద్కర్ విలువలకు అద్ధం పట్టేలా జనసేన-టీడీపీ పాలన
విజయనగరం (న్యూస్ తెలుగు): విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం ఉమ్మడి తెలుగుదేశం-జనసేన పార్టీ అభ్యర్థి లోకం మాధవి నెల్లిమర్ల మండలంలోని మల్యాడ పంచాయతీ ఎస్‌సీ కాలనీలో పర్యటించారు. స్థానికంగా ఉన్నటువంటి దళిత యువత మహిళలతో మాట్లాడుతూ వచ్చేది జనసేన-తెలుగుదేశం ప్రభుత్వమేనని, దళితులను అక్కున చేర్చుకునే ప్రభుత్వం మరో మూడు నెలల్లో రాబోతుందని, దానికి తప్పకుండా ప్రతి ఒక్కరూ సహకరించి, ఈ దుర్మార్గపు జగన్ పాలనని ప్రాలద్రోలేలా ప్రతి ఒక్కరు నడుంబిగించాలని తెలిపారు. నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతిని అరికట్టాలంటే, వచ్చే ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేయాలని పిలిపునిచ్చారు. అధికారంలోకొచ్చిన తర్వాత దళితులని విస్మరించే ప్రభుత్వం కాదని, దళితుల హక్కులను పరిరక్షించే ప్రభుత్వమని తెలియజేశారు. (Story: అంబేద్కర్ విలువలకు అద్ధం పట్టేలా జనసేన-టీడీపీ పాలన)
See Also
తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా కే.శ్రీనివాస్‌రెడ్డి
టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది!
సర్వే సంచలనం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!