Homeటాప్‌స్టోరీవిజువల్ ట్రీట్‌గా ‘ఖుషి’ టైటిల్ సాంగ్

విజువల్ ట్రీట్‌గా ‘ఖుషి’ టైటిల్ సాంగ్

విజువల్ ట్రీట్‌గా ‘ఖుషి’ టైటిల్ సాంగ్

డాషింగ్ హీరో ది విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న పాన్ ఇండియన్ చిత్రం ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. మైత్రీ మూవీస్ నిర్మిస్తోన్న ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదల కాబోతోంది. ఈ మధ్యే ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను ప్రారంభించింది చిత్రయూనిట్. ఇప్పుడు మేకర్లు మ్యూజికల్ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌లో చేపడుతున్నారు.

తాజాగా ఖుషి థర్డ్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. ఖుషి అంటూ సాగే ఈ టైటిల్ సాంగ్ ఇప్పుడు శ్రోతలను ఆకట్టుకుంటోంది. ఈ పాటకు శివ నిర్వాణ సాహిత్యం అందించారు. హిషామ్ అబ్దుల్ వాహబ్ స్వయంగా ఆలపించారు. ఇక  హిషామ్ అబ్దుల్ వాహబ్ అందించిన బాణీ ఎంతో వినసొంపుగా ఉంది. ఇక ఇందులో విజువల్స్ మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా ఉన్నాయి. ఈ మెలోడీ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారనుంది.

ఇప్పటికే ఖుషి ఫస్ట్ సింగిల్ నా రోజా నువ్వే వంద మిలియన్ల వ్యూస్‌ను క్రాస్ చేసింది. ఇన్ స్టాగ్రాం రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌లో ఇలా ఎక్కడపడితే అక్కడ ట్రెండ్ అవుతూనే ఉంది. రెండో పాట ఆరాధ్య సైతం శ్రోతలను కట్టి పడేసింది. ఇప్పుడు ఈ మూడో పాట ఖుషి సైతం చార్ట్ బస్టర్ అయ్యేలా కనిపిస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 1న తెలుగుతో పాటు తమిళ్, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయబోతోన్నారు.

నటీనటులు:
విజయ్ దేవరకొండ, సమంత, జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, శరణ్య పొన్ వణ్నన్, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు.

టెక్నికల్ టీమ్:

మేకప్ : బాషా
కాస్ట్యూమ్ డిజైనర్స్ : రాజేష్, హర్మన్ కౌర్, పల్లవి సింగ్
ఆర్ట్ : ఉత్తర కుమార్, చంద్రిక
ఫైట్స్ : పీటర్ హెయిన్
రచనా సహకారం : నరేష్ బాబు.పి
పి.ఆర్.వో : జి.ఎస్.కె మీడియా
పబ్లిసిటీ : బాబ సాయి
మార్కెటింగ్ : ఫస్ట్ షో
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : దినేష్ నరసింహన్
ఎడిటర్ : ప్రవీణ్ పూడి
ప్రొడక్షన్ డిజైనర్ : జయశ్రీ లక్ష్మీనారాయణన్
మ్యూజిక్ డైరెక్టర్ : హిషామ్ అబ్దుల్ వాహబ్
డి.ఐ, సౌండ్ మిక్స్ ః అన్నపూర్ణ స్టూడియోస్, విఎఫ్ఎక్స్ మాట్రిక్స్
సి.ఇ.ఓ : చెర్రీ
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : జి.మురళి
నిర్మాతలు : నవీన్ యేర్నేని,రవిశంకర్ యలమంచిలి
సాహిత్యం                        : శివ నిర్వాణ
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం : శివ నిర్వాణ. (Story: విజువల్ ట్రీట్‌గా ‘ఖుషి’ టైటిల్ సాంగ్)

News on YouTube

Bro Success Celebrations

హంతకుడుగా ముద్రపడిన కెప్టెన్ మిల్లర్‌!

క‌న్నీళ్లు ఆర‌క‌ముందే… మ‌ళ్లీ వ‌ర‌ద‌!

హీరో నితిన్‌కు ఎక్స్‌ట్రాలు ఎక్కువే!

షూటింగ్‌లో ఉప‌వాసం చేసిన ప‌వ‌ర్‌స్టార్‌!

మెగాస్టార్ ‘భోళా శంకర్’ ‘మిల్కీ బ్యూటీ’ పాట వ‌చ్చేసింది!

ఆ చేప కన్పిస్తే…సునామీనే!

చికెన్‌ ముక్క కాలుమీదపడి కాలినందుకు రూ.7 కోట్ల నష్టపరిహారం

వివేకా హ‌త్య కేసులో ఆ నివేదిక‌లే కీల‌కం!

షాకింగ్‌ న్యూస్‌: హీరో అబ్బాస్‌ ఇప్పుడు కారు డ్రైవరా?

ప్రేమలో సంతోషం, బాధ అన్నీ..!

బిగ్‌బాస్ సొహైల్‌కు క‌డుపొచ్చింది!

‘మహావీరుడు’కు రవితేజ వాయిస్ ఓవర్

స‌రికొత్త లుక్‌లో వ‌రుణ్ తేజ్

https://www.youtube.com/@abtimes106

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Jacqueline Fernandez Latest Pics