UA-35385725-1 UA-35385725-1

 డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కు ఘన నివాళులు

 డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కు ఘన నివాళులు

మారుతీ వరప్రసాద్ సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి

న్యూస్ తెలుగు / వినుకొండ : భారతదేశ ప్రజానీకానికి మహోన్నతమైన రాజ్యాంగ గ్రంధాన్ని రచించి అందించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనమైన నివాళులర్పించిన సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతీ వరప్రసాద్. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని శివయ్య భవన్ లో శుక్రవారం నాడు సిపిఐ వినుకొండ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించిన కార్యక్రమానికి సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు అధ్యక్షత వహించి నిర్వహించగా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ. దేశంలోని పేద దళిత బలహీన వర్గాలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల అభ్యున్నతి కొరకు వారి హక్కుల కొరకు మరియు భారతదేశంలో నివసించే అన్ని జాతులు కులాలు, మతాలకు ప్రజలకు సమాన హక్కులు కల్పించే విధంగా సాంఘిక ఆర్థిక రాజకీయాలలో అందరికీ సమాన అవకాశాలు కల్పించే విధంగా ఆయన రచనలు అత్యద్భుతంగా దేశ ప్రజలకు ఉపయోగపడ్డాయని ఈనాడు దేశంలోని ప్రతి ఒక్కరూ ఆ రాజ్యాంగాన్ని పకడ్బందీగా అమలు జరప వలసి ఉండగా రాజ్యాంగాన్ని దేశ ప్రజలకు సమానంగా అమలు పరచాల్సిన ప్రభుత్వాలు నేడు దేశంలోని అనేక మైనారిటీ మతస్తుల ప్రజలపై హింసను ఉసిగొల్పి దేశంలో వారికి అభద్రతాభావాన్ని కల్పిస్తున్నారని ఇది క్షమించరాని నేరమని దేశ అత్యున్నత న్యాయస్థానం సైతం మాట్లాడుతూ రాజ్యాంగాన్ని పటిష్టంగా అమలు పరచాల్సిన ప్రభుత్వాలు రాజకీయ నేతలు అత్యున్నత న్యాయస్థానాల తీర్పులపై న్యాయాధిపతులపై విమర్శనాస్త్రాలు సంధించడం న్యాయస్థానాలపై రాజకీయ నాయకుల జోక్యం రాజకీయాలను ఆపాదించడం దేశ సంస్కృతికి దేశ ఐక్యతకు పెను ప్రమాదమని పేర్కొన్నారని ఆయన తెలిపారు. సమానత్వానికి ప్రతీకగా సమాజ మార్గదర్శిగా వెలుగొందిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆనాడే మాట్లాడుతూ ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత దేశ ప్రజలకు ప్రభుత్వాలకు ఉన్నదని దీనిని కాల దన్నుకున్న రోజున దేశం విచ్ఛిన్నం అయిపోతుందని అన్నారని ఆయన గుర్తు చేశారు. రాజ్యాంగాన్ని కాలదన్ని ప్రజాస్వామ్యాన్ని పూల దోస్తు నేడు కేంద్రంలోని కొందరు పెద్దలు కొన్ని రాష్ట్రాలలో మతోన్మాద ఘర్షణలతో ప్రజలను మూక హింసలకు గురి చేస్తూ అమానవీయంగా మారణకాండ సృష్టిస్తున్నారని ఇటువంటి దుర్మార్గ చర్యలపై కేంద్రం సాచివేత ధోరణి అవలంబిస్తోందని ఇది దేశానికి మంచిది కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భిన్నత్వంలో ఏకత్వంగా విభిన్న జాతులు మతాలు, కులాలు నివసిస్తున్న మన దేశంలో అందరికీ రాజ్యాంగం సమానంగా వర్తిస్తుందని అందరికీ మత స్వేచ్ఛ ఉంటుందని దానిని అందరూ గౌరవించాలని ఆనాడే సమస్త సమాజం ప్రజానీకం ఆనందంగా నవభారతంగా వెలుగొందుతుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా సిపిఐ వినుకొండ నియోజకవర్గ కమిటీ నాయకత్వం అందరూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు, పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము, పిన్నబోయిన వెంకటేశ్వర్లు, రాయబారం వందనం, ఎ. పవన్ కుమార్, షేక్ మస్తాన్, జిల్లి వెంకటేశ్వర్లు,కె. మల్లికార్జునరావు, ఖాదర్ వలి, మస్తాన్వలి కొత్త కుమారి, కొమ్ము పుష్పలత, గాలేటి అంజి, గురమ్మ, కోటమ్మ, కాలవ అక్కమ్మ, దాసరి రాయలమ్మ, మేడి ఈరమ్మ, దావులూరి సంజన, అచ్చుకట్ల బాల, నాలకపల్లి సంధ్య తదితరులు పాల్గొన్నారు. (Story :  డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కు ఘన నివాళులు)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1