నూతన బస్సు సర్వీసు ప్రారంభం
రాష్ట్రానికి పరిశ్రమలు వస్తుంటే మాజీ ముఖ్యమంత్రి జగన్ ఓర్చు కోలేకపోతున్నారు:ఎమ్మెల్యే జి.వి
న్యూస్‌తెలుగు/ వినుకొండ : స్థానిక ఆర్టిసి డిపో లో బుధవారం నూతన బస్సులు ప్రారంభోత్సవానికి విచ్చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే జీ.వీ.ఆంజనేయులు వారిని సాదరంగా ఆహ్వానించిన ఆర్టీసీ డిఎం కోటేశ్వర నాయక్ మరియు యూనియన్ల నేతలు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పడిన తర్వాత ఆర్టీసీలో మంచి మంచి సంస్కరణ మొదలయ్యాయి అని అన్నారు. భవిష్యత్తులో ఇంకా ఎన్నో బస్సులు నూతన బస్సులను తీసుకురావడం జరుగుతుంది అన్నారు. అనారోగ్యం తో బాధపడుతున్న వారికి ఎయిమ్స్ ఆస్పత్రి ఉన్నంతగా అండగా నిలబడినదని అన్నారు. దక్షిణ భారతదేశంలోనే నాణ్యమైన వైద్యం అందించడంలో మంగళగిరి ఎయిమ్స్ పేద ప్రజలకు కొండంత అండగా నిలబడింది అన్నారు. ఎయిమ్స్ ఆస్పత్రికి వెళ్లాలంటే గతంలో ఉన్న ఇబ్బందులకు ప్రజలకు గురయ్యారని వినుకొండ డిఎం మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ కి వెళ్ళటానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం ఆనందదాయకం అన్నారు. అనారోగ్యంతో బాధపడే వాళ్ళు పేదవారందరికీ మంచి వైద్యం కావాలంటే పది రూపాయల ఓపి తోటి వెళ్లి నాణ్యమైన వైద్యం చూపించుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు. రూరల్ లోని ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలకు మెరుగైన బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని డిఎం కి సందర్భంగా సూచించారు. చదువుకునే విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులకు లేకుండా వారికి బస్సును ఏర్పాటు చేయడం అలాగే ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కోసం మన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంతో కృషి చేస్తున్నారని ప్రయాణికులందరికీ ఎంతో మేలు జరుగుతుందని ఈ సందర్భంగా చేయడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎస్.టి.ఐ ధనమ్మ, ఎంప్లాయిస్ యూనియన్ నేతలు పి. సాంబా శివరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు పఠాన్ అయూబ్ ఖాన్ ,పత్తి పూర్ణచంద్రరావు, సౌదాగర్ జానీ భాష, చికెన్ బాబు, బిజెపి ,జనసేన పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. (Story : నూతన బస్సు సర్వీసు ప్రారంభం)