పారిశుద్ధ కార్మికులకు ఎఫ్ ఆర్ ఎస్ తప్పనిసరి
మున్సిపల్ కమిషనర్
న్యూస్‌తెలుగు/వినుకొండ : వినుకొండ మున్సిపాలిటీ పరిధిలో ప్రజారోగ్య విభాగంలో పనిచేస్తున్న పారిశుధ్య సిబ్బంది పనితీరు మెరుగుపరుస్తూ వారి యోగక్షేమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జి వి ఆంజనేయులు సూచన మేరకు వినుకొండ మున్సిపల్ కమీషనర్ సుభాష్ చంద్రబోస్ ప్రజారోగ్య కార్మికుల హాజరును ట్రాక్ చేయడానికి ముఖ గుర్తింపు వ్యవస్థ (ఎఫ్‌ఆర్‌ఎస్)ను అమలు చేయడాన్ని పునరుద్ధరించారు. ప్రతి కార్మికుడు తమ పారిశుధ్య మరియు పర్యావరణ కార్యదర్శుల నుంచి తప్పనిసరిగా ఎఫ్‌ఆర్‌ఎస్ తీయించుకోవాలని ఆయన ఉద్ఘాటించారు.
పబ్లిక్ హెల్త్ విభాగంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడానికి ఎఫ్‌ఆర్‌ఎస్ ద్వారా పారిశుధ్య కార్మికుల హాజరు దోహదం చేస్తుందని పేర్కొన్నారు . ముఖ గుర్తింపు సాంకేతికతను ఉపయోగించుకోవడం ద్వారా మునిసిపల్ పబ్లిక్ హెల్త్ వర్కర్లు వారికి కేటాయించబడిన కార్యాలయాల పరిధిలో హాజరు క్రమానుగతిని ఎప్పుడైనా చూసుకోవచ్చని కమీషనర్ తెలిపారు.ప్రజారోగ్య కార్యకర్తల హాజరును ఖచ్చితంగా రికార్డ్ చేయడానికి ఎఫ్‌ఆర్‌ఎస్ సహాయపడుతుందని ఒకరి స్థానంలో వేరొకరు లబ్ధి పొందడానికి అవకాశం ఉండదని తెలిపారు.ప్రజారోగ్య కార్మికుల హాజరు గుర్తింపు మరియు ప్రయోజనాలను నిర్వహించడానికి ఎఫ్‌ఆర్‌ఎస్ సురక్షితమైన సమర్థవంతమైన మరియు పారదర్శకమైన మార్గమని కమీషనర్ వక్కాణించారు. (Story ; పారిశుద్ధ కార్మికులకు ఎఫ్ ఆర్ ఎస్ తప్పనిసరి)