బస్ విభాగంలో క్లియర్‌ట్రిప్ 150% వృద్ధి నమోదు
బెంగళూరు: ఫ్లిప్‌కార్ట్ కంపెనీ అయిన క్లియర్‌ట్రిప్, ఏప్రిల్ 2023లో తమ కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుండి బస్ కేటగిరీలో 150% అసాధారణ వృద్ధిని నమోదు చేసింది. ఈ అద్భుతమైన వృద్ధి బస్సు ప్రయాణానికి ముఖ్యంగా టైర్ 2 నగరాల నుండి బలమైన డిమాండ్‌ను వెల్లడిస్తుంది. ఈ కేటగిరీలోని అవకాశాలపై ఆధారపడి, క్లియర్‌ట్రిప్ తమ కస్టమర్లకు బస్సు ప్రయాణాన్ని మరింత సరసమైనదిగా చేయడానికి పరిశ్రమలో మొట్ట మొదటిసారిగా ‘బస్ పాస్’ఆఫర్ ను తీసుకువచ్చింది. తరచుగా బస్సు ప్రయానాలను చేసేవారికి గణనీయమైన పొదుపు, మెరుగైన విలువ-ఆధారిత ఆఫర్‌లను అందించడం బస్ పాస్ లక్ష్యంగా పెట్టుకుంది. క్లియర్‌ట్రిప్‌లోని వినియోగదారుల డేటా వెల్లడిరచిన దాని ప్రకారం, గత 3 నెలల్లో 32% మంది వినియోగదారులు తమ బుకింగ్‌లను పునరావృతం చేశారు. 15% మంది వినియోగదారులు మూడు నెలల్లో కనీసం మూడు సార్లు బుక్ చేసుకున్నారు. 75% మంది బుకింగ్ చేసేటప్పుడు డిస్కౌంట్ కూపన్‌లను ఉపయోగిస్తున్నారు. ఇండోర్-భోపాల్, బెంగళూరు-హైదరాబాద్, ఇండోర్-పుణె, చెన్నై-మదురై, కోయంబత్తూరు-బెంగళూరు అధిక రిపీట్ బుకింగ్‌లతో అగ్ర శ్రేణి మార్గాలుగా నిలిచాయి. (Story : బస్ విభాగంలో క్లియర్‌ట్రిప్ 150% వృద్ధి నమోదు)