UA-35385725-1 UA-35385725-1

శ్రీ వివేకానంద డిగ్రీ విద్యార్థులకు ఉచితంగా కెనరా బ్యాంకు ఖాతాలు

శ్రీ వివేకానంద డిగ్రీ విద్యార్థులకు ఉచితంగా కెనరా బ్యాంకు ఖాతాలు

కర్రస్పాండెంట్ భాస్కర్ రెడ్డి

న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణములోని రేగాటిపల్లి రోడ్డు-శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల విద్యార్థిని విద్యార్థులకు కెనరా బ్యాంకు వారి సహకారంతో ఉచితంగా జీరో బ్యాలెన్స్ ఖాతాలను అందించటం జరిగిందని శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల కరస్పాండంట్ భాస్కర్ రెడ్డి, డైరెక్టర్ బాలం లక్ష్మీనారాయణ రెడ్డి , కళాశాల ప్రిన్సిపాల్ హర్ష వర్ధన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దర్శినమల కెనరా బ్యాంకు మేనేజర్ దివ్య సహకారంతో కెనరా ఆస్పైర్ పథకం కింద కళాశాలలోని విద్యార్థులకు ఉచితంగా బ్యాంకు ఖాతా నమోదు చేయటం జరిగిందని వారు తెలిపారు ఈ ఖాతాల ద్వారా ప్రతి విద్యార్థి డబ్బును ఆదా చేసుకోవటమే కాకుండా, ఈ పథకం కింద కెనరా బ్యాంకు వారు విద్యార్థులు ప్రపంచ పోటీ ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న అనేక కోర్సులను ఉచితంగా చదువుకోవచ్చునని తెలిపారు.అలాగే భవిష్యత్తులో ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నపుడు రాయితీ ఉంటుందని,అలాగే జీవిత భీమా కూడా విద్యార్థులకు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఏవో అండ్ ఇన్చార్జి రమేష్,అధ్యాపక, బోధ నేతల బృందం, కళాశాల విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు. (Story : శ్రీ వివేకానంద డిగ్రీ విద్యార్థులకు ఉచితంగా కెనరా బ్యాంకు ఖాతాలు)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1