UA-35385725-1 UA-35385725-1

మైనర్లు వాహనాలను అప్పగించి ప్రమాదాలకు కారకులు కావద్దు

మైనర్లు వాహనాలను అప్పగించి ప్రమాదాలకు కారకులు కావద్దు

జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్

న్యూస్‌తెలుగు/ విజయనగరం టౌన్ : జిల్లా ఎస్పీ ఆదేశాలతో నవంబరు 9, 10 తేదీల్లో రెండు రోజులపాటు స్పెషల్ డ్రైవ్ చేపట్టి, జిల్లా వ్యాప్తంగా ఎం.వి.నిబంధనలు ఉల్లంఘించిన 579 వాహనాలను సీజ్ చేసి, పట్టుబడిన వాహనదారులకు, వాహన యజమానులకు, తల్లిదండ్రులకు ఆయా పోలీసు స్టేషను పరిధిలో సంబంధితల పోలీసు అధికారులు కౌన్సిలింగు నిర్వహించి, ఈ- చలానాలు విధించి, వాహనాలను రిలీజ్ చేసినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, మైనర్లయిన పిల్లలకు మోటారు సైకిళ్ళును ఇచ్చి, వారి జీవితాలను నాశనం చేయవద్దన్నారు. మైనర్లులో మానసిక పరిపక్వత, స్థిరత్వం లేకపోవడం, అత్యుత్సాహం, ఆకతాయితనం, అతివేగంగా వాహనాలను నడపడం, రహదారి భద్రత ప్రమాణాలు పాటించకపోవడం, వాహనాలను కంట్రోల్ చేయలేక పోవడం, పరిస్థితులను సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం, ప్రమాదాలను అంచనా వేయకపోవడం వంటి కారణాల వలన మైనర్లకి రవాణశాఖ డ్రైవింగు లైసెన్సులు మంజూరు చేయడం లేదన్నారు.ప్రతీ వాహనానికి రిజిస్ట్రేషను, ఇన్సూరెన్సు, వాహనాలను డ్రైవ్ చేసేందుకు డ్రైవింగు లైసెన్సు తప్పనిసరిగా ఉండాలన్నారు. వాహనాలకు సకాలంలో ఇన్సూరెన్సు చేయించడం వలన వాహనం ప్రమాదంకు గురైతే బాధితులకు పరిహారంగా చెల్లించాల్సిన సొమ్మును ఇన్సూరెన్సు కంపెనీ చెల్లిస్తుందని, లేకుంటే వాహనదారులే సొంతంగా పరిహారాన్ని చెల్లించాల్సి ఉంటుందని జిల్లా ఎస్పీ అన్నారు. విద్యార్థులపై కేసులు నమోదైతే ప్రభుత్వ ఉద్యోగాలు పొందేందుకు, ఉద్యోగాలు, చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్ళేందుకు ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. స్పెషల్ డ్రైవ్ చేసి ప్రజలను ఇబ్బంది పెట్టడం పోలీసుల అభిమతం కాదని, రహదారి భద్రతలో భాగంగానే స్పెషల్ డ్రైవ్స్ చేపట్టి, ఎం.వి. నిబంధనలు పాటించని వాహనదారులకు ఈ- చలానాలను విధిస్తామన్న విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. వాహనదారులు తమ వాహనాలను అనుమతి ఉన్నట్లే తమ భద్రతకు, ఇతర వాహనదారుల భద్రతకు కొన్ని బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసారు.
నవంబరు 9, 10 తేదీల్లో రెండు రోజులపాటు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్లో 579 వాహనాలను సీజ్ చేసామని, వాటిలో సెల్ ఫోను మాట్లాడుతూ పట్టుబడినవి – 3, డిఫెక్టివ్ నంబరు ప్లేట్స్ 49, మైనరు డ్రైవింగు -96, డ్రైవింగు లైసెన్సు లేనివి – 117, హెల్మెట్ వినియోగించని కారణంగా – 3, వాహనాలకు ఇన్సూరెన్సు లేనివి – 31, వాహనాలకు ఎటువంటి పత్రాలు లేనివి – 179, వాహనాలకు నంబరు ప్లేట్స్ లేనివి – 13, సౌండు పొల్యూషను – 12, ట్రిపుల్ రైడింగు – 76 వాహనాలను ఉన్నాయని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ వాహనదారులకు ఆయా పోలీసు స్టేషను పరిధిలో తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగు నిర్వహించి, వాహనాల పత్రాలను పరిశీలించి, ఈ-చలానా విధించి, విడిచి పెడుతున్నట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ తరహా ఆకస్మిక తనిఖీలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని, వాహనదారులు ఎల్లప్పుడు తమ వెంట వాహన రికార్డులు, ఇన్సూరెన్సు, డ్రైవింగు లైసెన్సు ఉంచుకోవడంతోపాటు, రహదారి భద్రత నియమాలు పాటించడం, హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని తెలిపారు. (Story : మైనర్లు వాహనాలను అప్పగించి ప్రమాదాలకు కారకులు కావద్దు)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1