పలువురు జనసేన పార్టీలో చేరిక
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పవన్ కళ్యాణ్ సమక్షంలో మంగళగిరిలో ధర్మవరం నియోజకవర్గానికి చెందిన వైసీపీ పార్టీ ముఖ్య నాయకులు జనసేన పార్టీలోకి చేరడం జరిగిందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ధర్మవరం మున్సిపాలిటీకి చెందిన వైఎస్ఆర్సిపి పార్టీ కౌన్సిలర్లు,మాజీ కౌన్సిలర్లు,వార్డు ఇన్చార్జులు ధర్మవరం నియోజకవర్గ ముఖ్య నాయకులు జనసేన పార్టీలోకి చేరడం జరిగింది అని తెలిపారు.వీరందరికీ పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి జనసేన పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడం జనసేన పార్టీలోచేరిన వారు 31 వ వార్డు కౌన్సిలర్ రమణమ్మ,28 వ వార్డు కౌన్సిలర్ సరితాల ఆశాబి,12 వ వార్డు కౌన్సిలర్ తొండమల ఉమాదేవి, 12 వ వార్డు మాజీ కౌన్సిలర్ రమాదేవి,13 వ వార్డు మాజీ కౌన్సిలర్ డిష్ రాజు, వైఎస్ఆర్సిపి పార్టీ వార్డు ఇన్చార్జులు 31 వ వార్డు ఇంచార్జ్ తోపుదుర్తి వెంకటరాముడు, 28 వ వార్డు ఇంచార్జ్ సరితల మహమ్మద్ భాషా, 12 వ వార్డు ఇంచార్జ్ తొండమల రవి, సౌత్ ఇండియన్ కాపు అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు తొండమల నాగార్జున, తొండమల సోమశేఖర్ పార్టీలో చేరడం జరిగిందన్నారు. అనంతరం చేరిన వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ విధానాలు,ప్రభుత్వ వైఖరి నచ్చక ఆ పార్టీని వీడి జనసేన పార్టీ సిద్దాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో , ధర్మవరం నియోజకవర్గ స్థానికుడైనటువంటి చిలకం మధుసూదన రెడ్డి అడుగుజాడల్లో ప్రజా సేవ చేయడానికి జనసేన పార్టీలోకి చేరడం జరిగిందన్నారు. పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తామని వారు తెలిపారు. (Story : పలువురు జనసేన పార్టీలో చేరిక)