UA-35385725-1 UA-35385725-1

వనపర్తి జిల్లాలో డీజే వినియోగం నిషేధం

వనపర్తి జిల్లాలో డీజే వినియోగం నిషేధం

న్యూస్‌తెలుగు/ వనపర్తి : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వనపర్తి జిల్లా పరిధిలో మతపరమైన ఊరేగింపుల్లో డీజే సౌండ్ సిస్టమ్ వినియోగంపై నిషేధం విధిస్తూ జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ఐఏఎస్, జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. డీజేల నుంచి అధిక డెసిబెల్స్ తో ఉత్పన్నమయ్యే శబ్దాల కారణంగా హృద్రోగులకు గుండెపోటు, ఇతర హృదయ సంబంధ ఇబ్బందులు వచ్చే ప్రమాదాలు ఉండడంతో పాటు చిన్నపిల్లలకు శాశ్వత వినికిడి సంబంధ సమస్యలు ఏర్పడే అవకాశం ఉన్నట్టు పలు పరిశోధనలు తెలియజేస్తున్నాయి. అంతే కాక సామాన్య ప్రజలు, ముఖ్యంగా వృద్ధుల ఆరోగ్యం దెబ్బతింటుందనే కారణంతో ఇకపై వనపర్తి జిల్లా పరిధిలో ఊరేగింపుల్లో డిజే సౌండ్ మిక్సర్లు, యాంప్లిఫయర్ మరియు బాణాసంచా ఉపయోగించడాన్ని నిషేధిస్తూ జిల్లా కలెక్టర్ , ఎస్పీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిబంధనలు, ప్రభుత్వ అనుమతులను ఉల్లంఘిస్తే బి.ఎన్.ఎస్ 223, 280, 292, 293, 324, బి.ఎన్.ఎస్ 152, పర్యావరణ పరిరక్షణ చట్టం సెక్షన్ 15 కింద కేసులు నమోదు చేస్తామని ఎస్పీ గారు వెల్లడించారు. ఈ నిషేధ ఉత్తర్వులను ఎవరైనా అతిక్రమిస్తే ఐదేళ్లు జైలు శిక్ష, రూ. లక్ష జరిమానా ఉంటుందని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ ఉత్తర్వులు పూర్తి స్థాయిలో అమలు చేయాలని వనపర్తి జిల్లా పరిధిలోని అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు పేర్కొన్నారు. ప్రజలకు, విధుల్లో ఉండే అధికారులకు కలుగుతున్న ఇబ్బందులు, తలెత్తున్న సమస్యలను విశ్లేషించి అందరీ అభిప్రాయాలను తీసుకున్న తర్వాత ఈ నిషేధాన్ని అమలు చేస్తున్నట్లు కలెక్టర్ ,ఎస్పీ వివరించారు. (Story : వనపర్తి జిల్లాలో డీజే వినియోగం నిషేధం)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1