UA-35385725-1 UA-35385725-1

ప్రభుత్వ చర్యతో రాష్ట్రానికి తీరని నష్టం

ప్రభుత్వ చర్యతో రాష్ట్రానికి తీరని నష్టం

పోలవరం ఎత్తు కుదింపు ప్రాజెక్టు లక్ష్యాలకు గండి
కూటమి ప్రభుత్వ చర్యతో రాష్ట్రానికి తీరని నష్టం
రెండు దశల్లో 45.57 మీటర్ల ఎత్తులో పోలవరం 
ఆ మేరకు జగన్‌గారు అనుమతి కూడా సాధించారు
చంద్రబాబు ఆ ఎత్తు 41.15 మీటర్లకు కుదించారు
అమరావతి కోసం పోలవరం ప్రాజెక్టు తాకట్టు పెట్టారా?
ఆ మేరకు చంద్రబాబు కేంద్రంతో రాజీ పడ్డారా?
చంద్రబాబు పోలవరం ఆపేసి పట్టిసీమ ఎందుకు కట్టారు?
అందుకోసం ఏకంగా రూ.1600 కోట్లు ఖర్చు చేశారు
పట్టిసీమ ప్రాజెక్టు వల్ల ఒనగూరిన ప్రయోజనాలు ఏమిటి?
2013 నాటి భూసేకరణ చట్టాన్ని కూడా పట్టించుకోలేదు
నాడు–నేడు చంద్రబాబు నిర్వాకం పోలవరానికి శాపం
పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు చారిత్రక తప్పిదాలు
డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ ఎవరిని ప్రశ్నిస్తున్నారు?
ఆయన కూడా ప్రభుత్వంలోనే ఉన్నారు కదా?
మీ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 5 నెలలు పూర్తి
అయినా ప్రశ్నిస్తూనే ఉంటారా? పైగా మీరు డీసీఎం
లా అండ్‌ ఆర్డర్‌ అంశం సీఎం చంద్రబాబు వద్ద ఉంది
అలాంటప్పుడు హోం మంత్రి అనితను ఎలా ప్రశ్నిస్తారు?
పాలక పక్షంలో ఉంటూ మీరే ప్రశ్నించడం సరి కాదు
:ప్రెస్‌మీట్‌లో బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్పష్టీకరణ
న్యూస్ తెలుగు/హైదరాబాద్‌ :  సీఎం చంద్రబాబు నిర్వాకం వల్ల మరోసారి పోలవరం ప్రాజెక్టు వివాదంలో చిక్కుకుందని మాజీ మంత్రి బుగ్గున రాజేంధ్రనాథ్‌రెడ్డి మండి పడ్డారు. చంద్రబాబు వైఖరి వల్ల పోలవరం ఎత్తు తగ్గించారని, దీని వల్ల మొత్తం ప్రాజెక్టు లక్ష్యాలకే గండి పడిందని, ఫలితంగా రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుందని ఆయన ఆక్షేపించారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును రెండు దశల్లో 45.57 మీటర్ల ఎత్తులో నిర్మించేందుకు నాడు సీఎం శ్రీ వైయస్‌ జగన్, పబ్లిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బోర్డు (పీఐబీ) అనుమతి కూడా సాధించారని గుర్తు చేసిన ఆయన, ఇప్పుడు చంద్రబాబు కేంద్రంతో రాజీ పడి ప్రాజెక్టు ఎత్తును 41.15 తగ్గించారని దుయ్యబట్టారు.
పోలవరం ఎత్తును 41.15 మీటర్లకు తగ్గిస్తూ, సవరించిన అంచనాల ప్రకారం ప్రాజెక్టు వ్యయాన్ని రూ.30,436 కోట్లుగా తేల్చి, కేంద్ర జలశక్తి శాఖ, రాష్ట్ర నీటిపారుదల శాఖకు గత సెప్టెంబరు 6న లేఖ రాసిందని, ఆ మేరకు ప్రాజెక్టు వ్యయంలో భరించాల్సి ఉన్న బ్యాలెన్స్‌ రూ.12,155 కోట్లు ఇచ్చేందుకు కూడా అంగీకరించారని మాజీ మంత్రి తెలిపారు.
వైయస్సార్‌ హయాంలో:
దీర్ఘకాలంగా ప్రతిపాదనలకే పరిమితం అయిన పోలవరం ప్రాజెక్టు పనులకు నాడు ఉమ్మడి రాష్ట్రంలో వైయస్సార్‌గారు సీఎం అయ్యాకే,  2005లోనే కదలిక వచ్చిందని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వెల్లడించారు. ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులు నాడే ఆయన సా«ధించారని గుర్తు చేశారు. ప్రాజెక్టుకు ఒకవైపు అనుమతుల ప్రక్రియ కొనసాగుతుండగానే, పనుల్లో జాప్యం లేకుండా మరోవైపు కుడి, ఎడమ కాల్వల నిర్మాణం కోసం అవసరమైన భూసేకరణ కూడా ఆయన చేపట్టారని తెలిపారు. వైయస్సార్‌ హయాంలోనే కాల్వల నిర్మాణం కూడా మొదలై, పనులు కూడా వేగంగా జరిగిన విషయాన్ని గుర్తు చేశారు.
కేంద్రం స్వయంగా కడతానన్నా..:
పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిన కేంద్రం, ఆ అంశాన్ని రాష్ట్ర పునర్విభజన చట్టంలో చేర్చి, స్వయంగా తామే కడతామని ప్రకటించినా, కమిషన్ల కోసం కక్కుర్తి పడిన అప్పటి సీఎం చంద్రబాబు, తామే కడతామంటూ తీసుకున్నారని మాజీ మంత్రి చెప్పారు. అయినా ప్రొటోకాల్‌ ప్రకారం పనులు చేయకపోవడంతో, పోలవరం ప్రాజెక్టు పనులన్నీ అస్తవ్యస్తమయ్యాయని.. మరోవైపు కొన్నాళ్లు పోలవరం పనులు ఆపేసి, పట్టిసీమను రూ.1600 కోట్లతో పూర్తి చేశారన్న ఆయన, దాని వల్ల ఒనగూరిన ప్రయోజనం ఏమీ లేదని స్పష్టం చేశారు. అసలు పట్టిసీమ
ఎందుకు కట్టాల్సి వచ్చిందో చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.
కేంద్రంతో రాజీ పడ్డారా?:
2014–19 మధ్య ప్రత్యేక ప్యాకేజీ కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిన చంద్రబాబు, అప్పుడు పోలవరం ప్రాజెక్టుకు నిధుల విషయంలో కూడా రాష్ట్రానికి అన్యాయం చేశారని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆక్షేపించారు. ప్రాజెక్టుకు అవసరమైన నిధులు రూ.16 వేల కోట్లు మాత్రమే ఇస్తామన్నా, చంద్రబాబు అందుకు అంగీకరించారని దుయ్యబట్టారు. 2013–14 నాటి ధరల ప్రకారం ఇచ్చిన నిధులతో, 2016లో ప్రాజెక్టు పనులు ఎలా సాధ్యమని ప్రశ్నించారు. మరోవైపు 2013 నాటి భూసేకరణ చట్టాన్ని కూడా చంద్రబాబు పట్టించుకోలేదని.. దాని వల్ల ప్రాజెక్టు నిర్మాణ వ్యయం మరింత పెరిగిందని చెప్పారు. మరోవైపు కాఫర్‌ డ్యామ్‌ పూర్తి చేయకుండా డయాఫ్రమ్‌వాల్‌ నిర్మించి మరో తప్పు చేశారని తెలిపారు.
చంద్రబాబు చేసిన ఇన్ని చారిత్రక తప్పిదాల వల్లనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మరింత ఆలస్యమైందని చెప్పారు. ఇప్పుడు కూడా ప్రాజెక్టు ఎత్తు తగ్గింపులో ఆయన, కేంద్రంతో రాజీ పడ్డారని భావించాల్సి వస్తోందని తెలిపారు. నాడు ప్రత్యేక ప్యాకేజీ కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెడితే, ఇప్పుడు అమరావతి కోసం పోలవరం ప్రాజెక్టును తాకట్టు పెట్టారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉందన్న, ఆయన ఈ ప్రాజెక్టు విషయంలో ఎక్కడా రాజీ సరికాదని తేల్చి చెప్పారు.
పవన్‌ వ్యాఖ్యలు హాస్యాస్పదం:
రాష్ట్రంలో శాంతి భద్రతల అంశాన్ని ప్రస్తావించి, హోం మంత్రిని నిందిస్తున్న డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ తన స్థాయిని తానే తగ్గించుకుంటున్నారని మాజీ మంత్రి ఆక్షేపించారు. పవన్‌ వ్యాఖ్యలు హాస్యాస్పదమన్న ఆయన, శాంతి భద్రతల అంశం హోం మంత్రి వద్ద కాకుండా, సీఎం వద్ద ఉంటుందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆ మాత్రం జ్ఞానం లేకపోతే ఎలా అని వ్యాఖ్యానించారు.
డిప్యూటీ సీఎం హోదాలో రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్న పవన్‌కళ్యాణ్, రాష్ట్రంలో శాంతిభధ్రతలు అదుపులో లేకపోతే ఎవరిని నిందిస్తున్నారని నిలదీశారు. ఈ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 5 నెలలు పూర్తవుతున్నా, ఇంకా గత ప్రభుత్వంపైనే ఆరోపణలు చేయడం, ప్రశ్నించడం ఏమిటని దుయ్యబట్టారు. అవన్నీ మాని ఇకనైనా పాలనపై దృష్టి పెట్టాలని, నేరాలు అరికట్టడం కోసం ప్రయత్నించాలని సూచించారు. అసలు పోలీసు వ్యవస్థ పని చేయకుండా పరిపాలన జరుగుతుందా? అన్న బుగ్గన, దీనికి సమాధానం చెప్పాల్సింది పోయి, ప్రజలను ప్రశ్నించడం ఏమిటని ప్రస్తావించారు.
కూటమి ప్రభుత్వంలో తనది కీలక పాత్ర అనే విషయాన్ని పవన్‌  మరిచిపోయినట్లున్నారని చురకలంటించారు. రాష్ట్రంలో 30 వేల మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారని ఎన్నికల ముందు చెప్పిన పవన్‌కల్యాణ్, డిప్యూటీ సీఎం అయిన తర్వాత, వారంతా ఎక్కడున్నారో ఎందుకు వెతికి తీయడం లేదని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు.(Story:ప్రభుత్వ చర్యతో రాష్ట్రానికి తీరని నష్టం)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1