ధర్మవరం పట్టణంలో గుంతలు పూడ్చే కార్యక్రమం
మిషన్ పాట్ హోల్ ఫ్రీ ఏపీ’ కార్యక్రమం ప్రారంభం
నియోజకవర్గంలోని ప్రధాన రహదారులపై రూ. 2 కోట్లు 90 లక్షలతో పనులు ప్రారంభం
ధర్మవరం ఎమ్మెల్యే, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : గత కొన్ని రోజులుగా పట్టణములో ఎటుచూచిన గుద్దలు ఉండడంతో ప్రయాణికులకు వాహనాలకు ఎన్నో ఇబ్బందులు కలగడంతో పాటు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నయ్. ఈ విషయాన్ని మంత్రికి ప్రజలు సత్య కుమార్ కు తెలియజేశారు. దీంతో మంత్రి సత్తి కుమార్ యాదవ్ గుంతలు పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా మిషన్ పాట్ హాల్ ఫ్రీ ఏపీ అనే కార్యక్రమాన్ని కూడా వారు ప్రారంభించారు. అనంతరం మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రధాన రహదారులపై రెండు కోట్ల 90 లక్షలతో ఈ గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజలు కూడా సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు తప్పక చేపడతామని మంత్రి భరోసా ఇచ్చారు.రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘మిషన్ పాట్ హోల్ ఫ్రీ ఏపీ’ కార్యక్రమం భాగంగా, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్ ధర్మవరం పట్టణంలో గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని సిఎన్బి ఫంక్షన్ హాల్ వద్ద స్వయంగా ప్రారంభించడం జరిగింది. వైసీపీ పాలనలో రాష్ట్రంలో రోడ్లు ప్రజలకు నరకాన్ని చూపించాయంటూ, ఈ పరిస్థితిని మార్చడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.860 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. వచ్చే జనవరి నాటికి రాష్ట్రంలో ఏ రహదారిపైనా గుంతలు కనిపించకుండా చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. (Story : ధర్మవరం పట్టణంలో గుంతలు పూడ్చే కార్యక్రమం )