వక్ఫ్ పరిరక్షణ మహాసభ ను విజయవంతం చేయాలి
యం.యం.డి.ఏ పిలుపు .. శ్రీ సత్య సాయి జిల్లా అధ్యక్షుడు సయ్యద్ రోషన్ జమీర్
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : వర్క్స్ పరిరక్షణ మహాసభను విజయవంతం చేయాలని ఎంబీఏ పిలుపుమేరకు శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు సయ్యద్ రోషన్ జమీర్ తెలిపారు. ఈ సందర్భంగా నియోజక వర్గ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల తో వారు మాట్లాడుతూ ముస్లిం మైనార్టీ డెవలప్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు యం.యం.డి.ఇమామ్ ఆదేశాల మేరకు జమాత్ ఏ ఇస్లామిక్ హింద్ ఆధ్వర్యంలో నవంబర్ 3వ తేదీన విజయవాడలోని కుమ్మరి పాలెం ఈద్గా మైదానం లో సాయంత్రం 5 గంటలకు జరిగే “వక్ఫ్ పరిరక్షణ మహాసభకు” ముస్లిం మైనార్టీ డెవలప్మెంట్ అసోసియేషన్ ద్వారా తమ మద్దతు తెలియజేస్తున్నామని మీడియా ద్వారా తెలిపారు. కావున శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా వున్న మసీదు మత పెద్దలు, మైనార్టీ నాయకులు, దర్గా, ఖాన్గా పెద్దలు, యం.యం.డి.ఏ. నాయకులు, ముస్లిం ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి వక్ఫ్ పరిరక్షణ మహాసభ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యం.యం.డి.ఏ. నాయకులు ఖాదర్ వలి, ముంతూ, మస్తాన్ వలి, రసూల్ తదితరులు పాల్గొన్నారు. (Story : వక్ఫ్ పరిరక్షణ మహాసభ ను విజయవంతం చేయాలి)