‘దానా’ తుఫాను పై ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలి
న్యూస్ తెలుగు /సాలూరు : దాన తుఫాను పై జిల్లా లో ఉన్న ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మాత్యులు గుమ్మడి సంధ్యారాణి అన్నారు. ఆమె విజయవాడ నుండి చరవాణిలో సందేశం ఇస్తూ రానున్న రెండు రోజుల్లో బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర ప్రభావం ఎక్కువగా ఉన్నందువలన జిల్లాలో ప్రభుత్వ అధికారులను రైతులను ప్రజలను అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని మన్యం జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు స్కూల్ కి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని. మత్స్యకారులు వేటకి వెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రధానంగా ఈ తుఫాను కారణంగా పొలాల్లో పండిస్తున్న ప్రతి. మొక్కజొన్న రైతులు అప్రమత్తంగా ఉండి ఇళ్లల్లో పంటను ఉంచుకోవాలని తెలియజేశారు.వరి రైతులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. (Story : ‘దానా’ తుఫాను పై ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలి )