పునర్వైభవం దిశగా వినుకొండ కాంగ్రెస్, సిద్ధమవుతున్న కార్యాలయం
న్యూస్ తెలుగు/వినుకొండ : రాష్ట్రంలో పునర్వైభవంపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఇటీవలే ఒక్కొక్కరు ఇన్‌ఛార్జీల నియామకం పూర్తి చేస్తున్న అధిష్ఠానం నూతన కార్యాలయాల ఏర్పాటుపైనా ప్రత్యేకశ్రద్ధ తీసుకుంటోంది. అందులో భాగంగానే వినుకొండ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయం ముస్తాబవుతోంది. నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ పనులు చకచక సాగుతున్నాయి. వినుకొండ- కారంపూడి రహదారిలోని టీవీఎస్ షోరూమ్ ఎదురూగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గస్థాయి కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉండేందుకు కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు పీసీసీ అధికార ప్రతినిధి కాసరగడ్డ నాగార్జున తెలిపారు. వినుకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేలా కార్యాచరణను రూపొందిస్తున్నారు. ఇందుకు సంబంధించి త్వరలో పూర్తి ప్రణాళికలతో ప్రజల ముందుకు వెళ్తామని ఆయన తెలిపారు. రాహుల్ గాంధీ పేరుతో ఛారిటబుల్ ట్రస్టును ఏర్పాటు చేశారు నాగార్జున. ఆర్జీ ట్రస్టు ద్వారా వినుకొండ నియోజకవర్గవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపడతామని నాగార్జున చెప్పారు.(Story:పునర్వైభవం దిశగా వినుకొండ కాంగ్రెస్, సిద్ధమవుతున్న కార్యాలయం)