పిడుగు పడి మరణించిన వ్యక్తి కుటుంబాన్ని ప్రభుత్వం అదుకోవాలి
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ మండలం దొండపాడు గ్రామంలో పిడుగు పడి మరణించిన .పి కొండయ్య కుటుంబాన్ని కూటమి ప్రభుత్వం 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలి.ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము.శనివారం వినుకొండ మండలం దొండపాడు గ్రామంలో పి. కొండయ్య 51 సంవత్సరాలు రైతు శుక్రవారం మధ్యాహ్నం గొర్లు వద్దకు పొలంకు వెళ్లగా ఉరుములు మెరుపులు వచ్చి పిడుగు కొండయ్య పై పడి అక్కడికక్కడే కొండయ్య రైతు మరణించడం జరిగిందని, చుట్టుపక్కల రైతులు చూసి కొండయ్య కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించడం జరిగింది. మరణించాడని తెలిసి కుటుంబం కన్నీరు మున్నేరుగా విలపిచ్చింది. కొండయ్యకు భార్య ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కొడుకు థర్డ్ ఇయర్ బిఎస్సి నర్సింగ్ చదువుతున్నాడని, కొండయ్య సంపాదన మీదే ఆ కుటుంబం ఆధారపడి ఉందని, భార్యకు గత ఏడాది పాము బారినపడి ఆమెకి కాలు పనిచేయట్లేదని, కొడుకు చదువు మధ్యలో ఉన్నదని ఆ గ్రామస్తులు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము, కొండయ్య కుటుంబ పరిస్థితి వివరించడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రి లో ఉన్న రైతు కొండయ్య మృతి దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం రాము మాట్లాడుతూ. కూటమి ప్రభుత్వం వెంటనే గత 5 ఏళ్లలో పల్నాడు జిల్లాలో అనేకమంది రైతులు పిడుగు పడి రైతులు మరణించడం జరిగిందని, దీనిపై ప్రభుత్వం ప్రత్యేక చట్టం చేసి రైతులని ఆదుకోవాలని, అలానే కొండయ్య కుటుంబానికి 10 లక్షలు ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని, అదేవిధంగా పల్నాడు జిల్లాలో పిడుగు బారిన పడి మరణించిన కుటుంబాలని గత ప్రభుత్వం పట్టించుకోలేదు కాబట్టి కూటమి ప్రభుత్వం ఆ కుటుంబాలను కూడా ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము కూటమి ప్రభుత్వాన్ని రైతుల పక్షాన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామానికి చెందిన రైతులు కొప్పరపు మల్లికార్జున రావు, తదితరులు పాల్గొన్నారు.(Story:పిడుగు పడి మరణించిన వ్యక్తి కుటుంబాన్ని ప్రభుత్వం అదుకోవాలి )