విశాలాంధ్ర 2025 సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ
న్యూస్ తెలుగు / వినుకొండ : భారత కమ్యూనిస్టు పార్టీ వందేళ్ళ పండుగ సందర్భంగా స్థానిక శివయ్య స్థూపం సెంటర్లో ఏర్పాటుచేసిన బహిరంగ సభ అనంతరం.. విశాలాంధ్ర 2025 నూతన సంవత్సరం క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది. ఈ క్యాలెండర్ ను సిపిఐ నేతలు పల్నాడు జిల్లా సిపిఐ కార్యదర్శి ఏ.మారుతి వరప్రసాద్, సీనియర్ న్యాయవాది పి.జె.లూకా, సిపిఐ ఏరియా ప్రధాన కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు, పట్టణ సిపిఐ కార్యదర్శి ఉలవలపూడి రాము, సిపిఐ సీనియర్ నాయకులు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సండ్రపాటి సైదా, కె.కిషోర్, పి.లాల్ ఖాన్, ఎస్.టి. యు నాయకులు చంద్రజిత్ యాదవ్, కార్యకర్తలు పాల్గొన్నారు. విశాలాంధ్ర కేలండర్ ఆకర్షణీయంగా ఉండటంతో క్యాలెండర్ ను కార్యకర్తలు అడగ్గా పంపిణీ చేయడం జరిగింది. (Story : విశాలాంధ్ర 2025 సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ)