గుంటూరు జిల్లా లో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలు
న్యూస్‌తెలుగు /వినుకొండ : జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి నిశ్శంకరావు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం అనంతరం సాయిబాబా దేవస్థానం నందు మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ శాసన సభ్యులు మక్కెన మల్లిఖార్జున రావు , మునిసిపల్ కమీషనర్ సుభాష్ చంద్రబోస్ ముఖ్య అతిధులు గా హాజరయ్యారు. రక్తదాన శిబిరానికి భారీ సంఖ్యలో జన సైనికులు హాజరయ్యారు. అనంతరం మునిసిపల్ కాంప్లెక్స్ నందు కేక్ కట్ చేసి…. పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో వినుకొండ పట్టణ టీడీపీ అధ్యక్షులు పఠాన్ ఆయుబ్ ఖాన్, టీడీపీ నాయకులు పత్తి పూర్ణ చంద్ర, జనసేన మండలాధ్యక్షులు పొనపల నరసయ్య, నిశ్శంకరావు అంకారావు, వల్లెపు అంకారావు, కొట్టే సుబ్బారావు, వేమా శ్రీను, గుద్దేటి బ్రహ్మం,జనసైనికులు, టిడిపి నాయకులు మరియు వీర మహిళలు అధిక సంఖ్య లో పాల్గొన్నారు. (Story : గుంటూరు జిల్లా లో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలు)