10 కేజీల గంజాయి పట్టివేత
న్యూస్ తెలుగు /సాలూరు : 10 కేజీల గంజాయి తో పట్టుబడ్డ ఇద్దరూ నిందితులు. శుక్రవారం అనగా తే 18.10.2024 ది న ఉదయం 7 గంటలకు పాచిపెంట ఎస్సై మరియు పోలీసు సిబ్బంది చాపరాయివలస గ్రామ పర్యటనలో ఉండగా. చాప రాయవలస గ్రామమునకు వెళ్ళు రోడ్డు వద్ద ఇద్దరు మగ వ్యక్తులు అనుమానస్పదంగా కనిపించడం జరిగింది. వారి చేతిలో బ్యాగులతో ఉండడం గమనించి వారిని పట్టుకుని వారి వద్ద ఉన్న బ్యాగులను తనిఖీ చేసి విచారించగా ఆ బ్యాగుల్లో సుమారు 10 కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించడం జరిగిందని అన్నారు. ఐదు ప్యాకెట్లలో నింపి రెండు బ్యాగులో ఉన్నాయి. అంతట వారిని విచారించగా అందులో ఒకరు సూరజ్ బాన్ ఉత్తరప్రదేశ్ కు చెందిన వ్యక్తిగా, రెండవ వ్యక్తి జితేంద్ర రాజు మహారాష్ట్రకు చెందిన వ్యక్తిగా గుర్తించడం జరిగింది. ఆ ఇద్దరు వ్యక్తులు ఒడిస్సా పాడువా నుంచి సదరు గంజాయిని నరేంద్ర సింగ్ అనే వ్యక్తి వద్ద నుండి కొనుగోలు చేసి మహారాష్ట్రలో ఎక్కువ ధరకు అమ్ముటకు గాను తీసుకొని వెళుతున్నట్టు తెలియజేశారు. వీరిపై కేసు నమోదు చేసి, సదరు ముద్దాయిలను రిమాండ్ కు తరలించడం జరిగిందని పాచిపెంట ఎస్సై సురేష్ కుమార్ తెలిపారు. (Story : 10 కేజీల గంజాయి పట్టివేత)