దాతల సహాయ సహకారములతోనే రోగులకు సేవలు చేయుట ఎంతో తృప్తి
శ్రీ సత్య సాయి సేవ సమితి
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : దాతల సహాయ సహకారములతోనే రోగులకు సేవలు చేయుట ఎంతో తృప్తిని, సంతోషమును కలిగిస్తుందని శ్రీ సత్యసాయి సేవా సమితి నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు సహాయకులకు 360 మందికి భోజనపు ప్యాకెట్లను వాటర్ ప్యాకెట్స్ ను ఆసుపత్రి వైద్యులు, నర్సుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. తదుపరి గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకంగా స్వీట్ లను పంపిణీ చేశారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ పుట్టపర్తి సాయిబాబా ఆశీస్సులతో గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు సహాయకులకు అన్నదానం కార్యక్రమం చేయడం జరుగుతోందని తెలిపారు. ఈ సేవా కార్యక్రమానికి దాతలు ముందుకు రావడం పట్ల వారు కృతజ్ఞతలు తెలియజేశారు. నాటి ఈ సేవా కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సేవా సమితి వారు ముందుకు వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగిందన్నారు. ఆసక్తి గల దాతలు సెల్ నెంబర్ 9966047044కు గాని 903044065కు గాని సంప్రదించాలని తెలిపారు. తదుపరి ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ మాధవి మాట్లాడుతూ శ్రీ సత్యసాయి సేవా సమితి వారు చేస్తున్న ఈ సేవలు రోగులకు ఒక వరం లాగా మారడంతో పాటు ఆకలి కూడా తీరుతోందని, సుధీర గ్రామాల నుంచి వచ్చిన వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి తరఫున శ్రీ సత్య సాయి సేవ సమితి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 27 మంది సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు. (Story : దాతల సహాయ సహకారములతోనే రోగులకు సేవలు చేయుట ఎంతో తృప్తి)