శివాలయ నిర్మాణమునకు భూమి పూజ
శ్రీ షిరిడి సాయి బాబా సేవ సమితి
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని పుట్టపర్తి రోడ్ శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో నూతనంగా శివాలయం నిర్మించేందుకు భూమి పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అధ్యక్షులు వీరనారాయణ, ఉపాధ్యక్షులు నారాయణరెడ్డి, కోశాధికారి రామలింగయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురువారం తెల్లవారుజామున శివాలయ నిర్మాణం కొరకు భూమి పూజను వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు నిర్వహించారు. ఇకనుంచి శిరిడి సాయిబాబా దేవాలయంలో శివాలయం కూడా నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ధర్మవరం పట్టణం సుభిక్షంగా ఉండాలన్న లక్ష్యంతో శివాలయాన్ని నిర్మాణం చేపట్టామని తెలిపారు. ఈ శివాలయ నిర్మాణం మొత్తం కావలసిన ఇటికలు జర్రిపోతుల శ్రీనివాసులు రెడ్డి విరాళంగా ఇవ్వడం జరిగిందని తెలిపారు. తదుపరి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సూర్య ప్రకాష్, రాంప్రసాద్, హేమంత్ కుమార్, వెంకటనారాయణ, చంద్ర, శ్రీనివాసులు, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. (Story : శివాలయ నిర్మాణమునకు భూమి పూజ)