ఘనంగా జరిగిన వాల్మీకి జయంతి వేడుకలు
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని కాయగూరల మార్కెట్ వీధిలో గల వాల్మీకి విగ్రహం వద్ద వాల్మీకి సంఘం నాయకులు ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలను నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా వాల్మీకి సంక్షేమ సంఘం నాయకులు బోయ రవిచంద్ర, సాకే మద్దిలేటి, నాగులయ్య, పూజా మొబైల్ సాయి మాట్లాడుతూ…. వాల్మీకుల ఆరాధ్య దైవం వాల్మీకి మహర్షి అని ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని తెలిపారు. తొలతా విగ్రహానికి పూజలు నిర్వహించారు. వాల్మీకి సంఘం నాయకులందరూ కూడా పూలమాలలతో వాల్మీకికి నివాళులర్పించారు. ధర్మం వైపు సత్యం వైపు సమాజాన్ని నడిపించాలన్నదే వాల్మీకి మహర్షి లక్ష్యమని తెలిపారు. మానవుడి జీవితాన్ని సుఖమయం ఆదర్శవంతం చేసే కుటుంబ రాజకీయ ధర్మాలను ఎన్నింటినో రామాయణంలో పొందపరచారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బొట్టు కృష్ణ, జింకల రాజన్న, చిన్న వీరప్ప, మహేష్ ,రమేష్ లింగప్ప, చీమల రామాంజి, చీమల సూరి, నరేష్ తదితరులు పాల్గొన్నారు. (Story : ఘనంగా జరిగిన వాల్మీకి జయంతి వేడుకలు)