ఇసుక అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘాను పెంచాలి
ఆర్డీవో మహేష్
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇసుక అక్రమ రవాణా పై సంబంధిత అధికారులు ప్రత్యేక నిదానము పెంచాలని ఆర్డీవో మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా రెవెన్యూ డివిజన్లోని వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు, డీఎస్పీ శ్రీనివాస్, ఫైర్ ఆఫీసర్ రాజు, ఇరిగేషన్ అధికారులు, డివిజన్ పరిధిలోని తాసిల్దార్లతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆర్డిఓ మహేష్ మాట్లాడుతూ చట్టపరిధిలోని ఇసుక రవాణా జరగాలని, అక్రమ ఇసుక రవాణా చేసే వాహనాలపై 24 గంటలపాటు కూడా తనిఖీలు ఉండాలని తెలిపారు. తనిఖీ లో భాగంగా అక్రమ ఇసుక రవాణా చేసే వాటి విషయంలో కఠిన చర్యలతో పాటు కేసులు కూడా నమోదు చేయాలని తెలిపారు. ప్రభుత్వం ఆదేశాల మేరకే ఇసుక రవాణా జరగాలని వారు స్పష్టం చేశారు. అదేవిధంగా క్రాకర్స్, ఫైర్ వర్క్స్ లైసెన్సుల జారీ, ఇచ్చేముందు తగిన జాగ్రత్తలు తీసుకొని, ఎటువంటి ప్రమాదాలకు తావు ఇవ్వరాదని తెలిపారు. అదేవిధంగా రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఏడు మండలాల తాసిల్దార్ కార్యాలయంలో ప్రజల సమస్యలను ప్రణాళిక బద్దంగా, చట్టబద్ధంగా పరిష్కరించే దిశలో బాధ్యతతో తమ విధులు నిర్వర్తించాలని తెలిపారు. ప్రజల ద్వారా ఫిర్యాదులు అందినచో కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ పరిధిలోని తాసిల్దార్లు, వివిధ విభాగాల అధికారులు, ఆర్డీవో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. (Story : ఇసుక అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘాను పెంచాలి)