బంజారాలకి న్యాయం చేయండి
ముఖ్యమంత్రి చంద్రబాబు… డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరుతూ లేఖ
న్యూస్‌తెలుగు/ వినుకొండ : ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం వినుకొండ టౌన్ ప్రెసిడెంట్ అమ్మ బాబు నాయక్ మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపు 78 సంవత్సరాలు కావస్తున్నను ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న బంజారాల స్థితిగతులు అగమ్య గోచరంగా ఉన్నది. దానికి కారణము బంజారాలకి రాజకీయ ప్రాధాన్యత లేకపోవటమే. అంటే దాదాపు 15 లక్షల బంజారాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నను బంజారా కమ్యూనిటీ నుంచి ఒక్క ఎమ్మెల్యే గాని ఒక ఎంపీ గాని ఒక ఎమ్మెల్సీ గాని లేరు. దానివలన బంజారా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చే ప్రతినిధులు బంజారాల నుంచి లేకపోవటమే. అందుచేత బంజారా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చేందుకుగాను ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర కమిటీ తరఫున గౌరవ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడుకి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు అయినటువంటి పవన్ కళ్యాణ్ కి అపాయింట్మెంట్ కోరుతూ లెటర్స్ రాయడం జరిగినది. దాదాపు ఒక నెల కావస్తున్నను మాకు ఎటువంటి అపాయింట్మెంట్ దొరకడం లేదు. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రివర్యులు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు వారి దృష్టికి ఈ క్రింద తెలియపరచినటువంటి సమస్యలను తీసుకెళ్లేందుకు గాను అపాయింట్మెంట్ ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. కనీస సౌకర్యాలు అయినటువంటి రోడ్డు సౌకర్యం గాని,త్రాగునీటి సౌకర్యం గాని అలాగే సెల్ టవర్స్ గాని లేనటువంటి తండాలు అనేకం ఉన్నాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ వారి చొరవతో ప్రతి మండలానికి దాదాపు మూడు కోట్ల రూపాయలు శాంక్షన్ అయినది. ఆ బడ్జెట్ లో ప్రతితాండాలకి బీటీ రోడ్డు మరియు సిసి రోడ్లు వేయవలసిందిగా కోరుచున్నాము.
బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ వారి జయంతిని పురస్కరించుకొని ప్రతి యేటా ఫిబ్రవరి 15వ తారీఖున సెలవు దినంగా ప్రకటించాలని కోరడంతోపాటు సేవాలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని అనంతపురం జిల్లా గుత్తి మండలం సేవాఘడ్ నందు జరిగే కార్యక్రమానికి దాదాపు ఒక కోటి రూపాయలు సాంక్షన్ చేయమని కోరడమైనది.
వేల కోట్ల రూపాయలు విలువచేసే హథిరామ్ జీ
మఠము ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయి వాటిని పరిరక్షించాలని కోరుచున్నాము. దాదాపు 30 – 40 సంవత్సరాల నుంచి బంజరు భూములు సాగు చేసుకున్నటువంటి బంజారాలకి పట్టాలు మంజూరు చేయమని కోరడమైనది.
గృహ వసతి సౌకర్యం లేక అనేకమంది బంజారా లు ఇబ్బంది పడుతున్నారు.ఎలిజిబిలిటీ ఉన్న బంజారా లందరికీ పక్కా గృహాలు మంజూరు చేయవలసిందిగా కోరడమైనది. శ్రీ సత్య సాయి జిల్లా,ముదిగుబ్బ టౌన్ లో ఎలిజిబుల్ ఉన్న కొంతమంది బంజారాలకి ఇళ్ల పట్టా ఇచ్చారు. కానీ అందులో మా బంజారా ప్రజలు ఇల్లు కట్టుకుంటుంటే కొంతమంది దుష్టశక్తులు అడ్డుపడుతున్నారు. ఆ విషయమై సంబంధిత జిల్లా కలెక్టర్ వారి దృష్టికి తీసుకెళ్ళిళ్లను న్యాయం జరగటం లేదు. అమాయకపు బంజారాలకి న్యాయం చేయమని కోరుచున్నాము. ఉద్యోగ అవకాశాల విషయానికి వస్తే డిగ్రీలు పేజీలు,బీటెక్ లు చదువుకొని అనేకమంది బంజారా లు ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతున్నారు. ఖాళీగా ఉన్న ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను ఫిలిప్ చేసి ఎస్టీలలో నిరుద్యోగిత శాతం తగ్గించవలసిందిగా కోరడమైనది.
అలాగే ST ఉద్యోగస్తుల ప్రమోషన్స్ విషయానికి వస్తే consequential సీనియార్టీ మేరకు ప్రమోషన్స్ ఇవ్వాలనే GO ఉన్నను దానిని చిత్తశుద్ధితో అమలుపరచటంలో విఫలమవుతున్నారు. అడిక్వసి ఉన్నప్పుడు ఎస్టీ పాయింట్లు ఇతర జనరల్ క్యాటగిరి తో ఫిలప్ చేస్తున్నారు. అదే Inadequacy ఏర్పడినప్పుడు ST vacancies ఖాళీ ఏర్పడినను అలాగే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నను ST పాయింట్స్ టర్న్ వచ్చేంతవరకు ఇవ్వడం లేదు. దీనివలన ప్రమోషన్లలో రిజర్వేషన్స్ ఉన్నాయని చెప్పుకోవటానికే గాని ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్లలో ఎటువంటి ప్రయోజనం ఉండదు. ST క్యాటగిరిలో Adequacy ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఎస్టీ రోస్టర్ పాయింట్స్ ఇతర జనరల్ క్యాండిడేట్స్ తో ఏ విధంగా అయితే ఫిల్లప్ చేస్తారో అదేవిధంగా ST క్యాటగిరిలో Inadequacy ఏర్పడినప్పుడు ఎస్టీ రోస్టర్ పాయింట్స్ టర్న్ తో సంబంధం లేకుండా ST పోస్ట్ ఖాళీగా ఏర్పడిన వెంటనే ఎలిజిబుల్ ఎస్టీ క్యాండిడేట్స్ తోటి ఫిలప్ చేయాలి.
డిగ్రీలు పీజీలు చదువుకొని ఉద్యోగాలు లేక వ్యాపారం చేసుకుని జీవనోపాధి చేసుకుందామని బంజారాలకి ప్రభుత్వ షెడ్యూల్ బ్యాంక్ నుంచి ఎటువంటి సహకారం అందటము లేదు.
నామినేటెడ్ పోస్టులలో బంజారాలకి సరైన ప్రాధాన్యత ఇవ్వాలని కోరడమైనది.
పైన తెలియపరచినటువంటి సమస్యల మీద చర్చించడానికి గాను ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ కి గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ ఇవ్వవలసిందిగా పత్రికల ముఖంగా కోరుచున్నాము.
ఈ కార్యక్రమానికి
ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం వినుకొండ టౌన్ ప్రెసిడెంట్ అమ్మ బాబు నాయక్ మరియు చక్రి నాయక్ రాంబాబు నాయక్ కోటేశ్వర నాయక్ రాము నాయక్ సేవా నాయక్ కొండా నాయక్ ఏడుకొండల నాయక్ బాలాజీ నాయక్ సేవా నాయక్ మంత్రుల నాయక్ తదితరులు పాల్గొన్నారు. (Story : బంజారాలకి న్యాయం చేయండి)