రైతుల పక్షాన నిలబడితే అరెస్టు చేస్తారా..?
అరెస్టును ఖండించిన నాయకులు
న్యూస్‌తెలుగు/వనపర్తి : కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా ఇండస్త్రీ కొరకు రైతుల దగ్గర భూసేకరణను వ్యతిరేకిస్తూ మాజీ శాసనసభ్యులు పట్నం.నరేందర్ రెడ్డి,ఎం.ఎల్.సి నవీన్ రెడ్డి నాయకత్వములో చేపట్టిన పాదయాత్రను భగ్నం చేస్తూ పోలీసులు అరెస్టు చేసి కొత్తకోట పోలీస్ స్టేషన్ కు తరలించడాన్నీ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. పోలీస్ స్టేషన్ నందు నాయకులకు సంఘీభావం తెలిపి అనంతరం ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ వ్యవస్థతో కుమ్మక్కై రైతులను ముంచుతున్న రేవంత్ రెడ్డి చర్యలను తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. రైతుల పక్షాన నిలబడి పోరాడుతున్న మా నాయకులను అక్రమంగా అరెస్టు చేసి కొత్తకోటకు తరలించడం పై పోలీస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని నిర్బంధాలు చేసిన ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ Z.P వైస్ చైర్మన్ వామన్ గౌడ్,మాజీ ఎం.పి.పి మౌనిక,విశ్వేశర్,చెన్నకేశవ రెడ్డి,జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల.అశోక్ ఉన్నారు. (Story : రైతుల పక్షాన నిలబడితే అరెస్టు చేస్తారా..?)