విజయవాడ వరద బాధితులను ఆదుకోవడం మనందరి బాధ్యత
పట్టు చీరల తయారీ వ్యాపారస్తుల సంఘం అధ్యక్షులు గిర్రాజు రవి
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ఇటీవల విజయవాడలో వచ్చిన వరదలు బీభత్సం సృష్టించాయని, అన్ని రకాలుగా విజయవాడ ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందని, వారందరినీ ఆదుకోవడం మనందరి బాధ్యత అని పట్టు చీరల తయారీ వ్యాపారస్తుల సంఘం అధ్యక్షులు గిర్రాజు రవి, కోశాధికారి కలవల మురళీధర్, ఉపాధ్యక్షులు పోలా ప్రభాకర్లు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని నేసే పేటలో కార్యాలయంలో విలేకరులతో వారు మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా విజయవాడ వరద బీభత్సంతో ప్రజలను సిటీని అతలాకుతలం చేయడం ఎంతో బాధాకరమన్నారు. అంతేకాకుండా ధర్మవరంలోని వ్యాపారస్తులు విజయవాడ వ్యాపారస్లో సత్సంబంధాలు ఉన్నాయని, వారందరినీ ఆదుకోవడం మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని తెలిపారు. ఇందులో భాగంగానే ఈనెల 14వ తేదీ పట్టణంలోని పొట్లమ్మ గుడి వద్ద నుంచి విరాళాలను సేకరించడం జరుగుతుందని తెలిపారు. విరాళాలను నగదురుపేనా లేదా చెక్కు రూపేనా కూడా ఇచ్చినచో స్వీకరించబడునని తెలిపారు. ఇప్పటికే పట్టణంలోని వ్యాపారస్తులకు వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలకు సమాచారాన్ని అందించామని, తద్వారా విరాళాలు సేకరించి ఆ డబ్బును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఉదాహరణ స్వభావంతో ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గాండ్ల రామాంజనేయులు, పల్ల నవీన్, శశిభూషణ్, హేమంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.