రాష్ట్రాన్ని ప్రమాద రహిత రాష్ట్రంగా చేసేందుకు గట్టి చర్యలు చేపడతాం.
ఎన్డీఏ కూటమి ద్వారా రాష్ట్ర ప్రజలకు సమస్యల ను పరిష్కారం చేస్తాం.
రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి.
న్యూస్ తెలుగు/ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా):ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రమాదరహిత రాష్ట్రంగా మార్చేందుకు తప్పనిసరిగా గట్టి చర్యలు చేపడతామని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రజలకు తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తప్పక నెరవేరుస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో వారు విలేకరులతో పలు విషయాలను తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం మొగలిఘాట్ లో జరిగిన సంఘటన చాలా బాధాకరమని ఏడుగురు మృతి చెందడం 33 మందికి గాయపడడం పై వారు స్పందిస్తూ ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు, క్షతగాత్రులకు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేసి కుటుంబాలను భవిష్యత్తులో కూడా ఆదుకుంటామని తెలిపారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గంలో అధికంగా ప్రమాదాలు జరిగే చోటును గుర్తించి ఒక ప్రత్యేకమైన చర్యల ద్వారా ప్రమాదాలు జరగకుండా చూస్తామని తెలిపారు. నేడు ఆర్టీసీ ఎంతో కుదేలుకు గురైందని, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసిన కార్మికులు ఉద్యోగుల సమస్యలు ఎప్పుడూ కూడా తీర్చలేకపోయారని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో 1400 బస్సులను కొనుగోలు చేయడం జరిగిందని ప్రస్తుతం 600 బస్సులు నడుపుతున్నామని, మిగిలినవి త్వరలో నడుపుతామని తెలిపారు. అంతేకాకుండా అతి త్వరలో ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీ సంస్థ ద్వారా నడపడం జరుగుతుందని, చేతివృత్తులు తదితర వృత్తుల వారిని కి ఉపాధి కల్పన కల్పిస్తామని, ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న అన్న క్యాంటీన్ ని ఇప్పటికే నూరు కేంద్రాలలో ప్రారంభించామని, మరికొన్ని కేంద్రాలను కూడా త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మతిస్థిమితం లేకుండా ఎన్డీఏ ప్రభుత్వం పై బురద చల్లడం ఇకనైనా మానుకోవాలని. ఐదు సంవత్సరాలలో చేయని ప్రజా సమస్యల పరిష్కారాన్ని మూడు నెలలలో ఇప్పటికే పెన్షన్ రూపంలో మాట నిలబెట్టుకోవడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా అతి త్వరలో రాష్ట్రంలోని మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సర్వీసును తప్పకుండా ప్రవేశపెడతామని తెలిపారు. తదుపరి విజయవాడలో ఇటీవల వరదలతో దాదాపు 3 లక్షల మంది ఆశ్రయము లేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, వారికి ప్రభుత్వం కూడా అహర్నిశలు కృషి చేస్తూ ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ,ఉన్నతాధికారులు కూడా కష్టపడి పని చేస్తున్నారని తెలిపారు. ఈ ఐదు సంవత్సరాలలో తాము ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోను తప్పకుండా పరిష్కరించి అమలు చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి కూడా పాల్గొన్నారు.(Story:రాష్ట్రాన్ని ప్రమాద రహిత రాష్ట్రంగా చేసేందుకు గట్టి చర్యలు చేపడతాం.)