
విజయవాడలో బోల్ట్.ఎర్త్ 1.5 ఎండబ్ల్యు ఈవీ ఛార్జింగ్ స్టేషన్
విశాలాంధ్ర/విజయవాడ: భారతదేశ అతిపెద్ద ఈవీ ఛార్జింగ్ నెట్ వర్క్ అయిన బోల్ట్.ఎర్త్ ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో పీ క్యూబ్ సొల్యూషన్స్ వద్ద అధిక సామర్థ్యం కలిగి ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేసింది. మొత్తం 1.5 ఎండబ్ల్యు ఛార్జింగ్ సామర్థ్యంతో ఈ ప్రాజెక్ట్ ఈ ప్రాంతపు ఈవీ ఛార్జింగ్ మౌలిక వసతులను గణనీయంగా విస్తరించింది. విజయవాడలోని నున్నలోజాతీయ రహదారి – 16 క్రాస్ వద్ద నెలకొన్న ఈ కేంద్రం అటు స్థానికులకు, ఇటు అందరికీ అందుబాటులో ఉండేలా నగరాల మధ్య ప్రయాణించే వాహనదారుల అవసరాలను తీర్చేలా ఉంటుంది. ఈ ప్రాజెక్టు అటు హై- పవర్ డీసీ ఫాస్ట్ ఛార్జర్లను, అదే విధంగా వివిధ ఈవీ కేటగిరీలకు రూపొందించబడిన పలు రకాల ఛార్జింగ్ సొల్యూషన్స్ ను కలిగిఉంటుంది. తద్వారా మరింతగా అందుబాటులో ఉండే ఛార్జింగ్ స్థితిగతులకు అండగా నిలుస్తుంది. కార్లు, ట్రక్కులు, బస్సులకు కూడా తోడ్పడేలా ఇక్కడ ఉన్న వాటిలో రెండు 240 కేడబ్ల్యు డీసీ ఫాస్ట్ ఛార్జర్లు, మూడు 180 కేడబ్ల్యు డీసీ ఫాస్ట్ ఛార్జర్లు, ఒక 60 కేడబ్ల్యు డీసీ ఫాస్ట్ ఛార్జర్ ఉన్నాయి. అదే విధంగా ద్విచక్ర వాహనాలకు, త్రిచక్ర వాహనాల ఛార్జింగ్ సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. ఇందులో 6 కేడబ్ల్యు త్రీ వీలర్ ఫాస్ట్ ఛార్జర్, ద్విచక్ర వాహనాల కోసం రెండు 3 కేడబ్ల్యు డీసీ ఫాస్ట్ ఛార్జర్లు, నాలుగు 3.3 కేడబ్ల్యు ఏసీ ఛార్జింగ్ సాకెట్స్ కూడా ఉన్నాయి. భారతదేశ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ మొబిలిటీకి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో వ్యూహాత్మకంగా అందరికీ అందు బాటులో ఉండే చోట నెలకొన్న ఈ అధిక సామర్థ్య ఛార్జింగ్ మౌలిక వసతులు ఎలక్ట్రిక్ మొబిలిటీ పరివర్తనకు అండగా ఉంటాయి. పీ క్యూబ్ సొల్యూషన్స్ ఛార్జింగ్ స్టేషన్ వంటి పరిణామాలు ఛార్జింగ్ మౌలికవసతులు కల్పించే సంస్థలు, స్థలాలు అందించే వారి మధ్య సహకారాలు ఇప్పటికే నిలదొక్కుకున్న పట్టణ కేంద్రాలను దాటి ఛార్జింగ్ యాక్సెస్‌ను విస్తరించడానికి ఎలా తోడ్పడుతాయో తెలియజే స్తాయి. (Story: విజయవాడలో బోల్ట్.ఎర్త్ 1.5 ఎండబ్ల్యు ఈవీ ఛార్జింగ్ స్టేషన్)
-
Top Stories You Can See
- అందం మీ సొంతం: సహజ నిగారింపుకు 6 పోషకాలు!
- బాదం పప్పులు తింటే శరీరంలో వేడి పెరుగుతుందా?
- మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?
- వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
- దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
- ఆ చేప కన్పిస్తే…సునామీనే!
- ఒకే ఆసుపత్రిలో 11 మంది స్టాఫ్ ఒకేసారి గర్భం దాల్చారు!
-
మల్లెపూలతో తెల్లార్లూ…!